`అసెంబ్లీ కూడా అదే కోరుకుంటోంది.
`తెలంగాణా ప్రజల్లో ఆసక్తి నెలకొని వుంది!

`మీడియా అంతా ఇప్పటికే అనేక వార్తలు వండి వారుస్తోంది?
`అసెంబ్లీ లో కేసీఆర్, రేవంత్ ల సంవాదం చూడాలని అందరికీ ఉంది?

`కేసీఆర్ మీద అసెంబ్లీ లో పై చేయి సాధించాలని కాంగ్రెస్ ఉవ్విల్లోరుతోంది?
`కేసీఆర్ కు ధీటుగా సమాధానం చెప్పాలన్న కసితో ఉంది?
`కేసీఆర్ మీద పాలకపక్షం గెలుస్తుందా? తెలిపోందా అనేది చూస్తేనే అందరికీ తనివి తీరుతుంది?
`సిఎం గా ఒక్కసారైనా కేసీఆర్ ముందు నిలబడి సమాధానం చెప్పాలని రేవంత్ కు వుంది!
`కేసీఆర్ చెప్పే లెక్కలకు ఎక్కాలు నేర్పాలని రేవంత్ ఎదురుచూస్తున్నట్లుంది?
`సమస్యల మీద కేసీఆర్ కు ఉన్నంత పట్టు ఎవరికీ లేదని తెలుసు?
`అయినా ఒక సంవాదం చేసి నెగ్గాలని రేవంత్ కు తహ తహగా వుంది?
`ఈ సారైనా కేసీఆర్ సమావేశలకు హాజరతారా? అనే అనుమానం కూడా అదే సందర్బంలో ఉంది!
`రెండు సంవత్సరాలుగా సీఎం రేవంత్ పేరు కేసీఆర్ ఉచ్చరించలేదు?
`అసెంబ్లీ లో కూడా రేవంత్ పేరు తీయకుండా మాట్లాడం సాధ్యమేనా?
`సభలో రేవంత్ కు ఆ కోరిక తీరేనా?
`ఆహ్లాదకరమైన వాతావరణంలో సమావేశాలు సాగేనా?
`చలికాలం లో రాజకీయ వేడి చలిని తరిమెసేనా?
`వెయిట్ అండ్ సి అని కేసీఆర్ రాక వాయిదా పడేనా?
`నరాలు తెగే ఇంతటి ఉత్కంట రాజకీయాలలలో ఎప్పుడూ లేదు!
హైదరాబాద్, నేటిధాత్రి: బిఆర్ఎస్పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు హజరౌతున్నారంటే చాలు ప్రజల్లో ఒక ఆసక్తి. నిండు సభలో కేసిఆర్ ప్రతిపక్ష నాయకుడిగా కూడా చూడాలని చాల మంది కోరుకుంటున్నారు. రాష్ట్రాన్ని తెచ్చి,పదేళ్లు పాలించిన కేసిఆర్, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజలకు సుపరిపాలన అందడం కోసం, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం సభకు రావాలని కోరుకుంటున్నారు. కేసిఆర్ సభకు వస్తే ఎలా వుంటుందో చూడాలన్న ఆసక్తి అందరిలోనూ వుంది. కేసిఆర్‌కు సభకు వచ్చిన తర్వాత సభా సంవాదం ఎలా సాగుతుందన్నది చూడాలన్న కోరిక కూడా చాల మందిలోవుంది. కేసిఆర్ గతంలో ప్రతిపక్షంలో వున్నప్పుడు కూడా అసెంబ్లీని గడగడలాడిరచిన సందర్భం వుంది. 2001 తర్వాత ఆయన సిద్దిపేట నుంచి ఇండిపెండెంటుగా పోటీ చేసి, తెలంగాణ కోసం నాలుగేళ్లపాటు తన గళం వినిపించిన నాయకుడు. సమయం దొరికినప్పుడుల్లా ఉమ్మడి రాష్ట్రంలో అడుగుడుగునా ఎలా అన్యాయం జరిగిందో అనేది ప్రపంచానికి తెలిసిలా చేశారు. ఉమ్మడి పాలకులు ఆ సమయంలో తెలంగాణకు చేసిన అన్యాయాలను ఎలిగేత్తి చాటేవారు. సభలో అన్ని విషయాలను ఏకరువు పెట్టేవారు. తెలంగాణ ప్రజల మనసు కదిలేలా చేశారు. తెలంగాణ మలి దశ ఉద్యమం ఊరిపోసుకొని ప్రజలే స్వచ్చందంగా ఉద్యమ కారులయ్యేలా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి, ఎంతో మంది చైతన్యవంతమైన ఆనాటి తెలంగాణ యువతరాన్ని కదిలించారు. పార్టీ నిర్మాణం చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో వెనుతిరిగి చూడలేదు. ప్రపంచంలో ఎక్కడా లేని విదంగా ఉద్యమాన్ని రాజకీయంలో రంగరించి తెలంగాణ పోరాటం చేశారు. ఉద్యమ రాజకీయ పంధాను సక్సెస్ పుల్గా నిర్వహించారు. పద్నాలుగేళ్లపాటు నిరంతర ఉద్యమం సాగించారు. విరామం లేని పోరాటం ఎలా వుంటుందో కూడా చూపించారు. అంతిమంతా తెలంగాణ సాదించి తెలంగాణ ప్రజలకు అందించారు. అందుకోసం ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మాటల్లో చెప్పుకుంటే సరిపోయేది కాదు. ఉద్యమంటే నాలుగు స్పీచ్‌లు కాదు. పోరాటమంటే నాలుగు జెండాలు పట్టుకొని ఊరేగింపు కాదు. స్ధితి ప్రజ్ఞతో, ఎంతో సత్య నిష్టతో కేసిఆర్ ఉద్యమ పోరాటం చేశారు. ప్రాణాలకు సైతం ఫణంగా పెట్టి తెలంగాణ సాదన యజ్ఞం చేశారు. ఇప్పుడు ఆయనతో ఆనాడు నడిచిన వారు కూడా రాజకీయ అవకాశాలు రాక విమర్శలు ఎంత మంది చేసినా కేసిఆర్ పట్టుదల , పోరాటం ముందు ఏవీ నిలబడవు. అంతే కాకుండా కేసిఆర్ దీక్ష వల్లనే తెలంగాణ వచ్చిందనేది తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిరది. కాలం మారినా, ఆయన త్యాగం మరుగున పడేది కాదు. కాలం కరిగిపోయినా ఆయన పోరాటం తెలంగాణ వున్నంత వున్నంత వరకు చెక్కు చెదిరేది కాదు. కేసిఆర్ అనే చరిత్రను చెరిపేసే శక్తి ఎవరికీ లేదు. కేసిఆర్ పోరాటం రాసుకున్న చరిత్ర కాదు. తెలంగాణలోని గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి అన్నీ కలిపి సాగిందే కేసిఆర్ ఉద్యమ ప్రస్తానం. అందుకే ఆయనంటే తెలంగాణ సమాజానికి అంత ఇష్టం. తెలంగాన సమాజమంటే ఆయనకు అంత ప్రాణం. తెలంగాణ వచ్చి పన్నెండేళ్లు దాటింది. ప్రభుత్వం కూడా మారింది. అయినా ఆయన స్దానం చెక్కు చెదరదు. ఆయన చరిత్ర పది కాలాలే కాదు, పది తరాలైనా పదిలంగానే వుంటుంది. జనం నోటి వెంట కేసిఆర్ అనే పదం వినిపిస్తూనే వుంటుంది. అందుకే కేసిఆర్ అసెంబ్లీకి వస్తున్నారంటేనే చాలు అదో రకమైన వైబ్రేషన్ తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. కేసిఆర్ అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా కూడా వస్తే చూడాలని వుందని తెలంగాన సమాజం కోరుకుంటోంది. ప్రతిపక్షనాయకుడిగా మళ్లీ ఆయన తెలంగాణ గురించి అసెంబ్లీలో మాట్లాడితే వినాలిని తెలంగాణ వెయి కళ్లతో ఎదరుచూస్తోంది. కేసిఆర్ అసెంబ్లీకి వస్తే ఏం మాట్లాడతారు? తెలంగాణ మీద ఆయన ఎలాంటి ప్రకటనలు చేస్తారు? ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెడతారు? ప్రభుత్వం మీద ఎలా విరుచుకు పడతారు? అనేది కూడా ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో కేసిఆర్ వస్తే ఎలా వుంటుందనే దానిపై కూడా మీడియా వర్గాలు కూడా ఎవరికి తోచినట్లు వారు వంటకాలు వండి వారుస్తున్నారు. పాలక ప్రతిపక్షం మధ్య ఆసక్తికరమైన సంవాదాలు జరుగుతుంటే చూడాలని అందరికీ వుంటుంది. అందులోనూ కేసిఆర్ సభలో వుండగా ఎలాంటి విషయాలు చర్చకువస్తాయి. వాటిని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది? అంతే కాదు ఒక్కసారైనా సరే కేసిఆర్ మీద పై చేయి సాదించాలని కూడా పాలకపక్షం ఎదురు చూస్తోంది. ముఖ్యంగా సిఎం. రేవంత్ రెడ్డి ఎంతో ఆశగా వున్నారు. ఎన్నికల్ల కేసిఆర్ మీద గెలిచిన ఆయన సభలో కూడా కేసిఆర్ మీద గెలవాలని అనుకుంటున్నారు. ఆ అవకాశం రెండు సంవత్సరాలుగా కేసిఆర్ ఇవ్వడం లేదు. సిఎం . రేవంత్‌కు దక్కడం లేదు. సహజంగా కేసిఆర్‌ను గెలిస్తే ప్రపంచం జయించింతన సంతోషపడాలన్న ఆశతో రేవంత్ వున్నారు. కేసిఆర్‌కు దీటైన సమాదానం ఒక్కసారైనా చెప్పాలన్న కసితో కూడా వున్నారు. కాకపోతే తెలంగాణ విషయంలో, వివరణలో కేసిఆర్‌ను మించే వారు ఎవరూ లేరు. కాని పాలకపక్షంలో వుండడం కాంగ్రెస్ పార్టీకి, నాయకులకు, ముఖ్యంగా సిఎం. రేవంత్‌కు కలిసొచ్చే అంశం. సహజంగా ఏ పాలకపక్షమైనా సరే నిజాలను అబద్దాలు, అబద్దాలను నిజాలు చేయొచ్చు. ఆ దిశగా ప్రతిపక్షం మీద పై చేయి సాదించొచ్చు. అలాంటి అవకాశం రేవంత్ ఇవ్వొద్దన్నదే కేసిఆర్ ఆలోచనగా వుంది. ఆయన రెండు సంవత్సరాల నుంచి ఇంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ పేరు ప్రస్తావనకు ఎప్పుడూ తీసుకురాలేదు. కేసిఆర్ నోట నుంచి సిఎం. రేవంత్ అనే మాట ఇప్పటి వరకు రాలేదు. అలా అని రేవంత్‌రెడ్డిని నేరుగా ఏనాడు ఆయన టార్గెట్ చేసి కూడా మాట్లాడలేదు. పైగా ఓ చానల్ ఇంటర్వూలో ఒక మంచి అవకాశం వచ్చింది. ప్రజలు మెచ్చే, నచ్చే పాలన చేయండి. మాకంటే బాగా పరిపాలన చేయండి. చిల్లర మల్లర పనులు చేసి అబాసు పాలు కాకండి. నవ్వెటోడి ముందు పడిపోయేలా వ్యవహరించొద్దన్న సూచన కూడా రేవంత్సర్కారుకు హుందాగా చేశారు. అయినా ఒక్కసారైనా సరే కేసిఆర్ ప్రశ్నకు సమాదానం చెప్పాలన్న తహతహ రేవంత్‌లో వుందనేది ఆది నుంచి అర్దమౌతూనేవుంది. తన ఐదేళ్ల పదివీ కాలంలో ఒక్కసారైన కేసిఆర్ తో జరిగే సంవాదంలో పై చేయి కావాలన్న ఆలోచనతో రేవంత్ వున్నారు. అయితే బిఆర్ఎస్ పార్టీ, సోషల్ మీడియా చేసిన ప్రచారం వల్ల కేసిఆర్ అసెంబ్లీకి హజరౌతారని ప్రభుత్వం కూడా అనుకుంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం నీళ్ల సమస్యల మీద అద్యయం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. తర్వాత ప్రిపేర్ అయి రాలేదన్న మాట పాలకపక్షం నుంచి వస్తే మొత్తానికే మోసమౌతుంది. గతంలో ఇలా ప్రతిపక్షంలో వున్నప్పుడు కాంగ్రెస్ నాయకులు అన్న మాటలు ఇప్పటికీ బిఆర్ఎస్ గుర్తు చేస్తూనే వుంటుంది. కేసిఆర్ నిజంగానే అసెంబ్లీకి హజరై, చర్చల్లో పాల్గొని సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చినా రేవంత్ రెడ్డి పేరు తీస్తారా? లేదా? అన్నది కూడ ప్రదాన అంశంగా మారిపోయింది. ఆ కోరిక సభలో తీరేనా? అనేదే ముఖ్యమైపోయింది. గతంలో అనేక సార్లు మిత్రులు రేవంత్ రెడ్డి అని కేసిఆర్ మాట్లాడిన సందర్భాలున్నాయి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి నష్టం జరుతుందని తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డిని సభలో కూడా వుండకుండా చేశారు. 2018 ఎన్నికల్లో ఏకంగా రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేశారు. కొడంగల్‌లో ఓడిరచారు. అలాంటి కేసిఆర్ నేరుగా రేవంత్ రెడ్డి ఎదురుగా చర్చలు జపడం జరుగుతుందా? అనేది ఇప్పటి వరకైతే క్లారిటీ లేదు. వస్తే మాత్రం ఆ రాజకీయమే వేరుగా వుంటుంది. చూసే వారికి కూడా ఎంతో రసవత్తరంగా వుంటుంది. కేసిఆర్ ఎక్కడా వెనక్కి తగ్గొద్దనుకునే వారి సంఖ్యనే ఎక్కువగా వుంటుంది. అదుకే కేసిఆర్ అసెంబ్లీకి రావాలని జనం కూడా పదే పదే ఆశిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం!!
