`మేక వన్నె కథలు ఎవ్వరూ నమ్మరు?
`కవిత సీఎం ఎప్పటికీ కాలేదు? పగటి కలలు నెరవేరవు?

`నలుగురు జేజేలు కొడితే పదవులు రావు?
`ప్రజల ఆశీస్సులు కవితకు కనిపించడం లేదు?

`పూటకో మాట మాట్లాడితే జనం అసలే నమ్మరు?
`‘‘ కెేసీఆర్’’ ను టార్గెట్ చేస్తే పుట్టగతులు కూడా వుండవు?

`బీఆర్ఎస్ జోలికొస్తే ఆ మాత్రం ఆదరణ అసలే ఉండదు?
`కార్యకర్తలు కష్టపడి కట్టుకున్న గుడి బీఆర్ఎస్ పార్టీ?
`నాయకులు ఇష్టపడి కాపాడుకుంటున్న బడి బీఆర్ ఎస్?
`కేసీఅఆర్ ను సార్ అని కొలుస్తూ ఆరాధిస్తున్నది జనం.
`ఆ పునాదులు కదపడం ఎవ్వరికైనా అసాధ్యం?
`కారును ఖతం చేస్తా! కాంగ్రెస్ లోకి వస్తా?
`ఎప్పటికయినా సీఎం అవుతా?
`కవిత కంటున్న పగటి కలలు?
`పట్టుమని పదిమంది లేని సంస్థ తో కవిత రాజకీయాలు?
`జనం బాటకు జనాలే కరువు?
`పిలిచినా ఒక్కరు రావడం లేదని తెలిసి మనుకున్న యాత్ర?
`పంచాయతీ ఎన్నికల సమయం చూసి బీఆర్ఎస్ నాయకుల మీద విమర్శలు?
`పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నప్పుడే కవిత కథ కంచికి చేరింది?
`కేసీఆర్ కు ఉత్తరం రాసి లీక్ చేసినప్పుడే పరువు పోయింది?
`తండ్రి కేసీఆర్ కోసం మొసలి కన్నీళ్లు?
`అన్న రామన్న కోసం అని పెడబొబ్బలు?
`హరీష్ రావు మీద అసత్య ప్రచారాలు?
`సంతోష్ రావు మీద నిందలు?
`బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద అభాండాలు?
`బీఆర్ఎస్ నాయకులు అవినీతి పరులంటూ ఆరోపణలు?
`పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రగతి లేదని అడ్డగోలు వ్యాఖ్యలు?
`దువ్వూరి సుబ్బారావుకు కనిపించిన అభివృద్ధి కవితకు కనిపించడం లేదా?
`తెలంగాణా సస్యశామలం కవిత చూడడం లేదా?
`తెలంగాణా అంతా కేసీఆర్ ను కీర్తిస్తుంటే కవితకు నచ్చడం లేదా?
`నీ రాజకీయం కోసం తండ్రి పేరు చెరిపేస్తావా?
`కేసీఆర్ పాలన మీద పరాయి పార్టీకి అవకాశం ఇస్తావా?
హైదరాబాద్, నేటిధాత్రి:
పదవి ప్రాణంతో సమానం. అధికారం ఆత్మను మించిన సంతోషం. రాజకీయం వ్యాపారం కన్నా గొప్ప సంపాదనకు మార్గం. అన్నీ బాగుంటే అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లి, అమ్మా, నాన్నా, బందువులు అనే బంధాలు, బందుత్వాలు వుంటాయి. ఒక్కసారి చెడితే ఎవరికి వారే యమునా తీరే..అది ఎంతటి బంధమైనా ఎంతటి సంబందమైనా సరే దూరమే…రాజకీయం రాజకీయమే!! ఇదే దేశంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న రాజకీయం. సకల వైషమ్యాలకు నిలయం. సకల కుయుక్తులకు కారణం. రాజకీయమే నమ్మకం లేని మోసపూరితమైన వ్యవహారం. ఈర్య్శ, అసూయ, ద్వేషం, కుత్సితం, కుతంత్రం అన్నీ కలగలిసిన రాజకీయం ఒక్కసారి ఆచరిస్తే చాలు వారికి ఎవరూ అవసరం లేదు? తనకు మించిన వారు ఎవరూ వుండొద్దు. ఇది రాజకీయ నాయకుల సహజ లక్షణం. ఊరి రాజకీయం నుంచి మొదలు దేశ రాజకీయాల వరకు ఇదే ఆచరణం. అది తెలంగాణలో మొదటిసారి కనిపిస్తోంది. దేవనపల్లి కవిత రూపంలో సాగుతున్న రాజకీయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంది. తెలంగాణ రాష్ట్రం సాదించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం గురించి అందరూ ఎంతో గొప్పగా చెప్పుకున్న రోజులున్నాయి. ఇప్పుడు ఏ కుటుంబమైనా అంతే…ఎంతో గొప్పగా కనిపించిన వారంతా అంతే!! అనే మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ సమాజం కూడా జీర్ణించుకోలేకపోతోంది? బిఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. కేసిఆర్ అభిమానులు వినలేకపోతున్నారు. తెలంగాణ బతుకమ్మ అని గొప్పగా కీర్తించిన తెలంగాణ సమాజం కూడా కవితను తప్పు పడుతున్నారు. కవిత ఎంచుకున్న విధానం కరక్టు కాదంటున్నారు. కవిత సొంత రాజకీయ మార్గం సరైందే కావొచ్చు. కాని ఆమె అనుసరిస్తున్న తీరు మాత్రం జనం స్వాగతించడం లేదు. ఆమె మాటలు వినేందుకు సిద్దంగా లేరు. అంతే కాదు కవిత ఇతరులను ఒక మాట అనడం, నాలుగు మాటలు పడే వరకు తెచ్చుకుంటున్నారు. ఇంతకీ కవిత ఎవరిపై యుద్దం చేస్తోంది? అనేది ఆమెకు స్పష్టత వుంది. కాని జనానికి ఆమె ఆంతర్యం నచ్చడం లేదు. బిఆర్ఎస్ పార్టీనే కవిత టార్గెట్ చేయడం ఎవరికీ ఇష్టం లేదు. బిఆర్ఎస్ నాయకుల మీద ఆమె చేస్తున్న వ్యాఖ్యలపై సమాజంలో అనేక చర్చలు జరుతున్నాయి. కవిత తన తండ్రిని ఈ వయసులో ఇబ్బంది పెడుతున్న సంగతి అందరికీ అర్దమైతోంది. కాంగ్రెస్‌నాయకుల జోలికి ఎందుకు వెళ్లడం లేదు? అనేదానిపై కూడా సమాజంలో రకరకాల ఊహాగానాలకు ఆమె అవకాశమిస్తున్నారు. సహజంగా ఎవరైనా సొంత కుంపటి పెట్టుకున్నప్పుడు అదికారంలోవున్న పార్టీ టార్గెట్‌గా రాజకీయం చేస్తారు. కాని బిజేపి పార్టీ లాగా ఆమె కూడా ప్రతిపక్ష బిఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ను తమల పాకుతో తట్టినట్లు, బిఆర్ఎస్ను తలుపు చెక్కతో కొట్టినట్లు కవిత మాట్లాడడాన్ని కూడా ఎవరూ ఆహ్వానించడం లేదు. బిఆర్ఎస్లో వున్నప్పుడు, పదవులు అనుభవించినప్పుడు చెప్పిన మాటలకు, ఇప్పటి మాటలకు అసలు పొంత లేదు. ఆమె చెబుతున్న అబద్దాలకు లెక్కలేదు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలకు కూడా అసలే సంబందం వుండడం లేదు. తన తండ్రి మీద ఎంతో ప్రేమ వున్నట్లు, తండ్రి అంటే వల్లమాలిన అభిమానం వున్న కూతురు లాగా కంటనీరు పెట్టుకొని మరీ కొన్ని సార్లు మాట్లాడారు. నాన్న జాగ్రత్త అని కూడా చెప్పారు. నాన్న ఆరోగ్యం జాగ్రత్త అన్నారు. అన్నా రామన్నా నువ్వుకూడా జాగ్రత్త అన్నారు. తండ్రి మీద, అన్న మీద కవితకు ఎంత ప్రేమ వుందో అని జనం అనుకునేలా మాట్లాడారు. నాలుగు రోజులు గడిచే సరికి ఆమె అసలు స్వరూపం చూపిస్తున్నారు. ఏకంగా కేసిఆర్‌నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కేసిఆర్ పాలనపై పరోక్షంగా దుమ్మెత్తిపోస్తున్నారు. పదేళ్ల కేసిఆర్ పాలనలో పార్టీ నాయకులు చేసిన అన్యాయాలు అక్రమాలకు అంతే లేదన్నట్లు మాట్లాడుతున్నారు. బిఆర్ఎస్ నాయకులు ఇటీవల కొంత కాలం వరకు మౌనంగానే వున్నారు. కవిత ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సహించారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఎంతెంత మాటలు అన్నదో అందరం చూశాం. అయినా భరించారు. కాని తాను బురద జల్లుతాను..మీరు తూడ్చుకోవాలి. అనేలాగా కవిత వ్యవహార శైలి శృతి మించింది. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు దగ్గరకు వచ్చే సరికి కవిత కూడా ఆరోపణలు ఎదుర్కొనే టైమ్ ఆమె కొని తెచ్చుకున్నది. కవిత ఇంకా తన వ్యవహార శైలిని మార్చుకోకుండా ముందుకు వేళ్తే పార్టీ నాయకులు ఉపేక్షించే పరిస్దితి వుండదు. రాజకీయంగా ఆమెను ఒక దశలో నిజామాబాద్ జిల్లా వరకు కుట్ర జరిగిందని ఆమె చెప్పిన మాటలు కూడా నమ్మశక్యంగా లేదు. ఎవరో ఓడిస్తే ఓడిపోయేంత వీక్‌గా కవిత నాయకత్వం వుందా? జిల్లాలో 11 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా కవిత ఎందుకు గెలవలేకపోయింది? అది తన నాయకత్వ లోపానికి నిద్శనం కాదా? కవిత భూస్తాపితం చేస్తే అయ్యే పార్టీయేనా బిఆర్ఎస్? కవిత చెరిపేస్తే చెదిరిపోయేదేనా కేసిఆర్ చరిత్ర. బిఆర్ఎస్ను కవిత ఇంకా విమర్శిస్తూ పోతే ఆమె మీద జనంలోవున్న సానుభూతి పోయే ప్రమాదముంది? ఈ సంగతి కవితకు తెలియక చేస్తుందా? లేక కావాలనే చేస్తోందా? అనే అనుమానాలు అందిరికీ వున్నాయి. ఏది ఏమైనా కవిత ఎంచుకున్న ఈ మార్గం ముమ్మాటికీ తప్పు. కవిత ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు తిరిగి తనవైపు తిరిగే ప్రమాదాన్ని ఆమె కోరి కోరి తెచ్చుకుంటున్నారు. అనవసమైన రాద్దాంతాన్ని ఆమె సృష్టించుకుంటున్నారు. సమాజంలో ఆమెపై వున్న సానుభూతిని ఆమె స్వయంగా చెరిపేసుకుంటున్నారు. ఇది ఆమె రాజకీయ జీవితానికి మార్గం వేయదు. పరిధి దాటి అవసరం లేని వ్యాఖ్యలు చేస్తున్న కవిత రాజకీయ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి!? నేను బురద జల్లుతాను? కడుక్కోండి? అంటే ఈ రోజుల్లో ఎవరూ ఊరుకోరు. ఎవరి స్వాతంత్య్రం వారిది. అయినా ఎదుటి వారిపై బరదజల్లుకుంటూ పోవడానికి మీరు ఎవరు? అనే ప్రశ్న సమాజం నుంచి కవిత ఎదుర్కొవాల్సి వస్తుంది. అప్పుడు కవిత దగ్గర సమాధానం వుండకపోవుచ్చు. అందువల్ల ఇతర నాయకుల మీద వ్యక్తిగత విమర్శలకన్నా, ఆయా నియోజక వర్గ సమస్యలను ప్రస్తావిస్తూ వెళ్లాలి. అంతే కాని అక్కడి నాయకుల మీద దుమ్మెత్తిపోస్తా అంటే ఊరుకోరు? అందుకే ఈ మధ్య బిఆర్ఎస్ నాయకులు కూడా కవిత మీద విమర్శల దాడిగ మొదలుపెట్టారు. కేసిఆర్ కూతురుగా అలాంటి మాటలు కవిత పడడం తెలంగాణ సమాజం కూడా జీర్ణించుకోలేకపోతోంది. కవితను విమర్శలు చేయాలని ఏ బిఆర్ఎస్ నాయకుడికి లేదు. కాని కవిత పనిగట్టుకొని బిఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ వెళ్తుంటే అన్ని బాణాలు ఒకేసారి కవిత మీద వచ్చి పడే ప్రమాదం లేకపోలేదు? ఇది ఆమె రాజకీయ జీవితానికి సరైన మార్గం కాదు. బిఆర్ఎస్ నాయకులు, జాగృతి కవితల మధ్య మాటల యుద్దాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కూకట్పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు ఊరుకోలేదు. కవిత వ్యాఖ్యల మీద ఘాటుగానే స్పందిచారు. ఇంతకీ కవిత ఎవరిపై యుద్దం చేస్తోంది?అనే ప్రశ్న అన్ని వర్గాలలో ఉత్పన్నమౌతోంది. బిఆర్ఎస్ పార్టీనే ఎందుకు టార్గెట్ చేస్తోంది? అనే చర్చ జోరుగానే సాగుతోంది. వరుసుగా బిఆర్ఎస్ నాయకులనే ఎందుకు విమర్శిస్తోంది? అనేదానిపై రచ్చ కొనసాగుతోంది. కాంగ్రెస్‌నాయకుల జోలికి ఎందుకు వెళ్లడం లేదు? అనేదే కీలకంగా మారుతోంది. అదికారంలోవున్న పార్టీని కాదని ప్రతిపక్షంపై దాడి ఎందుకు? అని మేధావులే అంటున్నారు. కవిత బిఆర్ఎస్లోనే వుంటే ఆ మాటలు మాట్లాడేదా? అనే వారికి కవిత దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే గతంలో ఆమె చెప్పింది కాదు. ఆ పార్టీలోనే వుంటే చెప్పేది కాదు. కవిత చెబుతున్న మాటల్లో నిజాలున్నాయా? అబద్దాలున్నాయా? అనేది సమాజంలో విశ్లేషించునే తీరిక ఎవరికీ లేదు. కేసిఆర్ మీద వున్న మమకారం పార్టీ నాయకులను కాపాడుతోంది. మరి కవితను అదే మమకారం ఎందుకు కాపాడలేదన్నది కవిత ఆలోచించుకోవాలి. కవిత చెబుతున్న మాటలు జనాలు వింటున్నారా? లేదా? అనేది ఆమె విశ్లేషించుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇతర పక్షాలు చేయాల్సిన ఆరోపణలు కవిత చేయడం వల్ల అవి నిజమని జనం అనుకోవడం లేదు? బిఆర్ఎస్ను భూస్తాపితం చేయడానికే కవిత కంకణం కట్టుకున్నదనే తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. అది కవిత రాజకీయానికి ఎంత మాత్రం మంచిది కాదు. బిఆర్ఎస్ నేతలు అందరూ నోరు తెరిస్తే పోయేది కవిత పరువే కాదు, కేసిఆర్ పరువు కూడా కూతురుగా ఆ విషయం అర్ధం చేసుకోలేకపోతే ఎవరూ కాపాడలేరు. నేను మంచిదాన్ని కాదు, మొండిదాన్ని, జగమొండిని అనే మాటలు బిఆర్ఎస్లో వున్నప్పుడు అంటుంటే అందరూ చప్పట్లు కొట్టారు. ఇప్పుడు అవే మాటలు మాట్లాడితే బిఆర్ఎస్ నాయకులే తిప్పికొడుతున్నారు. మంచిదానికి కాకనే పార్టీని, కేసిఆర్‌ను కష్టపెడుతున్నావు అనే మాటలు వినాల్సి వస్తుంది.. మొండితనం తన తండ్రి మీద చూపించే కూతురు అనుకోవాల్సి వస్తోంది. జగమొండి సాదించేమీ వుండదని అనుకుంటున్నారు ఒక్కసారి జనం మాటలు వినండి.
