సమస్య తెలియపరచాలని చూసిన స్పందించని కమిషనర్
పరకాల నేటిధాత్రి
పట్టణలోని సీఎస్ఐ కాలనీలో ఎస్ఎఫ్ఐ నాయకులు పర్యటించడం జరిగింది.ఈ పర్యటనలో భాగంగా ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ మాట్లాడుతూ
సిఎస్ఐ కాలనీలో డ్రైనేజ్ లు మురికి నిరుతో నిండిపోయాయని మున్సిపాలిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు కాలువలు తీయకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చిన్నపిల్లలు విపరీతమైన జ్వరంతో ఇబ్బందికు గురవుతున్నారని అన్నారు.ఇట్టి సమస్యలను చరవాణి ద్వారా మున్సిపల్ కమిషనర్ కి తెలియపరచాలని ప్రయత్నిచ్చినప్పటికి కమిషనర్ కనీసం స్పందించడం లేదని ప్రజా సమస్యలు పట్టించుకోలేని అధికారులు,ప్రజా ప్రతినిధులు ఎందుకని ప్రశ్నించారు.పట్టణంలోని పలు కాలనిలల్లో నిత్యావసర వ్యర్దాలతో చెత్త కుప్పలు తెప్పులుగా పడి ఉంటుందని పలు ప్రత్రికల్లో వార్తలు వచ్చినప్పటికి అధికారులల్లో ఎలాంటి చలనం లేదని,ఇప్పటికైనా స్థానిక కమిషనర్ వెంటనే స్పందించి ఎక్కడైతే డ్రైనేజ్ తీయలేదు వెంటనే పర్యటించి కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలన్నారు.ఎమ్మెల్యే ప్రజా సమస్యల మీద సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పటికి అధికారులకు మాత్రం ఏ మాత్రం చలనం లేకుండా పోయిందన్నారు.పట్టణభివృద్ధి ఎజెండా మీద ముందుకుపోతున్న స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించని అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో మడికొండ సిద్దు,చక్కని,శివ, సాయి తదితరులు పాల్గొన్నారు.