అర్హులైన వారందరికీ పించన్లు ఇవ్వాలి
సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు
కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…
కరకగూడెం: అర్హులైన పేదలందరికి వృధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు ఇవ్వాలని సీపీఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండలంలో ప్రతి గ్రామం నుండి ఇప్పటికే దరఖాస్తు తీసుకుని ఉన్నప్పటికీ వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని గత ప్రభుత్వంలో కూడా వందల సంఖ్యలో పెండింగ్లో ఉన్నప్పటికీ వాటిని అర్హులైన వారికీ అందించడంలో ప్రజా ప్రభుత్వం విఫలమవుతుందని వారన్నారు పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించటమే ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం అంటున్న పాలకవర్గ పెద్దలు వికలాంగులకు పింఛన్లు ఇచ్చే దిక్కు లేదా అని వారు తీవ్రంగా విమర్శించారు వారికి ఇందిరమ్మా రాజ్యం వర్తించదా అని వారు ఎదేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు కావస్తున్నా నేటికి ఒక్కరికి కూడా కొత్తగా పింఛన్ ఇచ్చిన దాఖలు లేవని వారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని ఇచ్చిన వాగ్దానం ప్రకారం పింఛన్దారులందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సత్యం కనితి రాజు తాటి దేవయ్య తదితరులు పాల్గొన్నారు