సిరిసిల్ల(నేటి ధాత్రి):
తెలంగాణలోని 398 రూపాయల స్పెషల్ టీచర్స్ కు తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ మంజూరు చేయాలని సిరిసిల్ల జిల్లా పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు వి. మధుకర్ రావు డిమాండ్ చేశారు. సిరిసిల్లలో జిల్లా కలెక్టరేట్ ముందు తెలంగాణ పెన్షనర్ల జేఏసీ పిలుపుమేరకు టీజీపీ జేఏసీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 398 రూపాయల వేతనంతో పని చేసిన స్పెషల్ టీచర్లకు పనిచేసిన కాలానికి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన విధంగా రెండు నేషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తూ పెన్షన్ బెనిఫిట్ ఇవ్వాలని బకాయి ఉన్న నాలుగు డీఏలను తక్షణమే మంజూరు చేసి నిధులు విడుదల చేయాలన్నారు. ఉచిత నగదురహిత వైద్యం అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందించాలని తదితర డిమాండ్లు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు పంజాల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు, సిహెచ్ జనార్ధన్, ఎండి రియాజుద్దీన్, కె రమేష్, భూమారావు, డి సత్తయ్య, అంజయ్య, వెంకటరమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.