నర్సంపేట,నేటిధాత్రి :
పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఎగ్జామ్ ప్యాడ్ పెన్నులు పట్టుకొని ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు.అనంతరం నరేష్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాలేక డిగ్రీ పీజీ బీడీ బీటెక్ బీఫార్మసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నత విద్య అభ్యసించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 8303 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని .రాష్ట్ర ప్రభుత్వం శీతాకాల అసెంబ్లీ సమావేశంలో చర్చించి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షాన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు కావ్య,రచన,రమ్య, భాగ్యశ్రీ,భవిత,సుజాత,ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.