
పెండింగ్ స్కాలర్ షిప్స్ చెల్లించాలి
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ఫీజు రియంబర్మెంట్లు స్కాలర్షిషిపులు విడుదల కొరకు పిడి ఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేయడం జరిగింది.ఈ సందర్భంగా పిడి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు పి.సికిందర్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలోని గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్మేంట్,స్కాలర్షిప్ 7200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.విద్యార్థులు పై చదువులు చదవాలంటే కార్పొరేట్ కళాశాలలోని ఫీజులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి గురి చేయడం వల్ల విద్యార్థులు చదువులని మానేసే పరిస్థితి నెలకొంటుంది.విద్యార్థులకు రావలసిన బకాయిలు తక్షణమే విడుదల చేసి వారికి న్యాయం చేయాలని కోరారు.జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చుట్టూ ప్రహరి గోడ లేకపోవడం వల్ల మహిళ విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనీ దీనిపై తక్షణమే ప్రభుత్వం,ఎమ్మెల్యే స్పందించి జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పి డి ఎస్ యు) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పిడి ఎస్ యు జిల్లా నాయకులు కార్తీక్,అన్వేష్,సుమంత్, వైష్ణవి,రోజా,మేఘన విద్యార్థులు పాల్గొన్నారు.