తక్షణమే సీఎం స్పందించి
ఫీజులు విడుదల చెయ్యాలి
ఎస్ఎఫ్ఐ నాయకులు బొడ్డు స్మరణ్
కుమ్మరి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్స్ తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ కుమ్మరి రాజ్ కుమార్
అన్నారు.రాష్ట్రంలో ఉపకార వేతనాలు విడుదల చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్
మాట్లడతూ గత ఆరేళ్ళ నుండి విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజులను ప్రభుత్వం చెల్లించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్ షిప్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరికి సంవత్సరానికి 3000 వేల కోట్లు అవసరం అవుతాయి.కానీ 2019 నుండి ఇప్పటి వరకు బకాయిలు పేరుకోని ఉన్నాయి. 2019 నుండి మొత్తం 8214.57 కోట్లు రూపాయలు ఫీజుల బకాయిలు ఉన్నాయి.ప్రభుత్వం విద్యార్థులు ఆందోళనలు చేసినప్పుడు టోకెన్లు జారీ చేయడం తప్ప ట్రెజరీల నుండి ఒక్కరూపాయి కూడా నిధులు విడుదల చేయడం లేదు. ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు రాలేదనే పేరుతో విద్యార్ధులకు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు. ఉన్నత చదువులకు వెళ్ళాలనే విద్యార్థులు తల్లిదండ్రులు సర్టీఫీకెట్స్ కోసం వడ్డీలకు అప్పులు చేస్తున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. కళాశాల యాజమాన్యాలు కూడా కళాశాల నడపడానికి బయట నుండి అప్పులు తెచ్చామని ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలలు మూతవేసే పరిస్థితి ఉందని వాపోతున్నారు. తక్షణమే పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ చందు ఈశ్వర్ నరేష్ స్వామి సుధీర్ తదితరులు పాల్గొన్నారు