ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత సంఘం
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు సోమవారం రోజున పిడి ఎస్ యు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పిడి ఎస్ యు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సికిందర్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ మెంట్ లను వెంటనే విడుదల చేయాలని కోరారు.అలాగే యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.కళాశాల చుట్టూ ప్రహరీ గోడ లేనందున రాత్రి సమయాలలో గుర్తుతెలియని వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని,ప్రభుత్వం వెంటనే స్పందించి కళాశాల ప్రహరి గోడ నిర్మించి విద్యార్థులకు భద్రత కల్పించాలని,కళాశాలలోని వివిధ సమస్యలను పరిష్కారం చేయాలని లేనియెడల ఉద్యమాలు త్రీవంగా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.