రామడుగు, నేటిధాత్రి:
తెలంగాణలో విధ్యార్ధులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఇప్పటికైనా ఈప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ కోరారు. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇవ్వల్సిన దాదాపు ఐదు కోట్ల పైగా బకాయిలు ఉన్నాయని, స్వరాష్ట్రం వస్తే నిధులు నియామకాలు వస్తాయని విద్యార్థులు కోటి ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థులకు మొండి చేయి చూపడం చాలా అన్యాయమన్నారు. అదే విధంగా ఫీజు బకాయిలు సరిగా విడుదల చేయకపోవంతో కళాశాల యాజమాన్యాలు విధ్యార్థులను ఫీజులు కట్టాలని వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని, ఇప్పటికైనా ఈకొత్త ప్రభుత్వం ఉన్నత విద్యపై ప్రత్యేక శ్రద్దాపెట్టాలని విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి విద్యార్థులను అందుకోవాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు.