బి,ఈడి పూర్తి కావస్తున్న ఇంత వరకు మొదటి సంవత్సరం నిధులు కూడా విడుదల చెయ్యలేదు
ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి పుల్లని వేణు
చేర్యాల నేటిధాత్రి…
పెండింగ్ లో వున్నా స్కాలర్షిప్స్, రియంబ ర్స్మెంట్ వెంటనే విడుదల చెయ్యాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి పుల్లని వేణు రాష్ట్ర ప్రభుత్వాన్ని శుక్రవారం డిమాండ్ చేశారు. చేర్యాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…. రాష్ట్రంలో గత ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వం మారిన విద్యార్థుల జీవితాలు మాత్రం మారలేదని, రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం సరికాదని అన్నారు. బీఈడీ, పీజీ విద్యార్థులకు రెండవ సంవత్సరం పూర్తిగా వస్తున్న మొదటి సంవత్సరం స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇంతవరకు విడుదల కాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి ఉన్నందున భయభ్రాంతులకు లోనవుతున్నారు.
విద్యార్థులు పై స్థాయి చదువులకు, ఉద్యోగాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురౌతయాని వారు అన్నారు.
యాజమాన్యాలను గట్టిగా ప్రశ్నిస్తే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల పూర్తిగా విద్యాసంస్థలు దెబ్బతిన్నాయని అప్పులలో కూలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని
ఆయన అన్నారు. చాలామంది విద్యార్థులు గ్రామాలలో పేద మధ్య, తరగతి విద్యార్థులు కావున వారు మధ్యలోనే చదువును ఆపేసే పరిస్థితి నెలకొంటూ ఉన్నదని ప్రభుత్వం విద్యార్థుల పట్ల, విద్యారంగం పట్ల సముకత చూపకుండా విద్యార్థుల భవిష్యత్తులను గాలికి వదిలేస్తుందని వారు అన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఆలోచన చేయాలని పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజురియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మండల అధ్యక్షుడు ఆత్మకూరు హరికృష్ణ, ఉపాధ్యక్షుడు ఎర్రోళ్ల అఖిల్, నంగి తిరుపతి, శ్రీనివాస్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.