
General Secretary D. Brahmanandam
పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలి
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లాలోని పోస్టుమెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న నైట్ వాచ్మెన్,డే వాచ్మెన్,కుక్,స్లీపర్,స్కావెంజర్స్ వేతనాలు గత ఏడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు.ఈ వేతనాలను తక్షణమే చెల్లించాలని కార్మికులను ఆదుకోవాలని శనివారం రోజున భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో దళిత అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ సిహెచ్.దుర్గ ప్రసాద్ కి మెమోరండం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి డి.బ్రహ్మానందం మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా పరిధిలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే కుక్,స్వీపర్ అండ్ స్కావెంజర్,నైట్ వాచ్మెన్,డే వాచ్మెన్ లకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు.మంచిర్యాల జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పని చేసే వర్కర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల వల్ల తీవ్ర జాప్యం జరుగుతుంది.రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసిన అనంతరం కంటిన్యూషన్ లెటర్ రాలేదని బిల్లులు పెట్టకుండా పెండింగ్ లో పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది.అనంతరం సంబంధిత శాఖ నుంచి ట్రెజరీ కి బిల్లులు పెట్టాల్సి ఉంటుంది.ఈ బిల్లులు పెట్టే కోణంలో ప్రొఫెషనల్ టాక్స్, టి.డి.ఎస్ కట్టకుండా బిల్లులు పంపించడం వల్ల ట్రెజరీ లో బిల్లులు చేయకుండా పెండింగ్ లో పెడుతున్నారు.బిల్లులు రిటర్న్ చేస్తున్నారు.ఒకవేళ ట్రెజరీ నుంచి బిల్లులు చేసి ప్రభుత్వ ఖజానాకు పంపిస్తే ఈ కుబేర్ అని,బ్రీజింగ్ అని నెలలు గడిచి పోతుంటాయి.ఈ విధానం వల్ల దళిత అభివృద్ధి శాఖ పోస్టుమెట్రిక్ హాస్టల్ లో పనిచేసే వర్కర్స్ కు వేతనాలు రాకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు.కనుక ఇప్పటికైనా ప్రభుత్వం,ప్రభుత్వ యంత్రాంగమంతా ఈ విధానాన్ని మార్చి కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు కలెక్టర్ ఖాతా నుంచి చెల్లించే విధంగా ప్రణాళిక రూపొందించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐఎఫ్ టియు) డిమాండ్ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో సంపత్,సునీత, మల్లేశ్వరి,హేమ,పద్మ,లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.