
ఫీల్డ్ అసిస్టెంట్ల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి….!
జహీరాబాద్ నేటి ధాత్రి:
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో, ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న వారి మూడు నెలల పెండింగ్ వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, ఫీల్డ్ అసిస్టెంట్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ పటేల్ కోరారు. సోమవారము మండల కేంద్రమైన ఝరాసంగం లో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఉపాధిహామీ పథకంలో, ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నాం. ఈ ఉద్యోగం పైనే మా కుటుంబాలు అన్ని ఆధారపడి జీవిస్తున్నాయని ఆయన తెలిపారు. గత మూడు నెలల నుండి మాకు వేతనాలు అందక కుటుంబాలను పోషించలేక చాలా ఇబ్బందికరంగా మారిందని, తమ పిల్లల ఫీజులు కట్టుకోలేక ఇంట్లో ఖర్చులు కుటుంబాలను పోషించలేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించి తమ కుటుంబాలను అందుకోవాలని ఈశ్వర్ పటేల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.