
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ కొంతమంది రైతులకు రుణమాఫీ చేసి మరికొంతమంది రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో కొత్త రుణాలు పొందేందుకు రైతులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు . సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకులలో 200 నుండి 250 మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో రుణమాఫీ అయితదేమో అని ఎదురు చూసిన రైతులు రుణమాఫీ కాకపోవడంతో రుణమాఫీ అయిన లిస్టులలో పేర్లు రాని రైతులు ఎంతోమంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ గాని రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. రాబోయే ఖరీఫ్ పంటకు క్వింటాల్‌కు 2800 వరి పంటకు , పత్తికి 15 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్లో ధాన్యమును అమ్ముకునేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పత్తిని విక్రయించుకునేందుకు సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. గత ఏడాది పత్తి పంట నేటికీ ఎంతోమంది రైతులు అమ్ముకోకుండా ఇండ్లలోనే నిలువ నిల్వ చేసుకోవడంతో రైతుల కుటుంబాలు దీనివల్ల అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు. మధ్య దళారుల నుండి కాపాడేందుకు ముందస్తుగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లయితే రైతులు మద్దతు ధర పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు, మండల కమిటీ సభ్యులు వ్యాసరాని శ్రీను, వేముల లింగస్వామి, సాగర్ల మల్లేష్ తదితరులు ఉన్నారు.