పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 27న నిర్వహించే చెరువు హైదరాబాద్ విద్యార్థికి మహాగర్జన వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది దాంతోపాటు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని వారు అన్నారు ఫీజు రీయింబర్స్మెంట్ రాక ప్రైవేట్ యజమాన్యాలు విద్యార్థులపై వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు డబ్బులు కట్టలేని విద్యార్థులు చదువు మధ్యలోనే వదిలేసి పనులకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది దాంతోపాటు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ఎంఎస్ హాస్టల్స్ కు సొంత భవనాలు నిర్మించాలి సొంత భవనాలు లేకపోవడం వల్ల విద్యార్థులు చదువుకోవడానికి ఆటంకంగా మారిందని వారు అన్నారు అదేవిధంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు సంబంధించి సొంత భవనాలు వెంటనే ఏర్పాటు చేయాలని వారు అన్నారు దాంతోపాటు సంక్షేమ హాస్టల్స్ పూర్తిగా విచ్ఛిన్నమయ్య పరిస్థితి మారిందని వారు వాపోయారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కేజీబీవీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు అన్నారు కేజీబీవీ హాస్టల్స్ పేరుకే అప్డేట్ చేశామని చెప్తున్నారు కానీ కేజీబీవీ హాస్టల్స్ లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దాంతోపాటు సరిపడ క్లాస్ రూమ్స్ లేకపోవడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అదేవిధంగా రెగ్యులర్ ఎంఈఓ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియమించాలని అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యారగానికి సంబంధించి అనేక మైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు తక్షణమే సమస్యలు పరిష్కరించేలాగా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా రేపు నిర్వహించబోయే చలో హైదరాబాద్ విద్యార్థి మహాగర్జనను జయప్రదం చేయాలని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పిలుపుని ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గోమాస నరేష్ జిల్లా కమిటీ సభ్యులు సూర్య కాలేజీ కమిటీ సభ్యుడు మహేష్ నవీన్ ఆది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!