వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో 32 వ వార్డుకు చెందిన చాతుర్య, గౌతమ్ యాదవ్ లను వార్డు కౌన్సిలర్ పెండెం నాగన్న యాదవ్, సగర సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుక సత్యం సాగర్, మానవపాడు వెంకటయ్య, కురుమన్న, శ్రీనివాసులు శాలువాతో సన్మానించారు విద్యార్థుల ను అభినందించారు.
సురేష్ యాదవ్,సుజాత దంపతుల కుమార్తె చాతుర్య యాదవ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరం 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించడం ఎంతో సంతోషదాయకమన్నారు. అలాగే పల్లవి, కృష్ణ యాదవుల కుమారుడు గౌతమ్ యాదవ్ పదవ తరగతిలో 10/10 సాధించడం పట్ల సంతోషంతో వారిని అభినందిస్తూ భవిష్యత్తు లో కూడా విద్యలో ప్రగతి సాధించాలని సూచిం చారు