ఎస్సై ని కలిసిన పెగడపల్లి నూతన సర్పంచ్
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రామగిరి రామన్న తన గ్రామ నాయకులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీధర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామంలోని శాంతి భద్రతలు, ప్రజల సమస్యలు,రానున్న రోజుల్లో గ్రామాభివృద్ధికి పోలీస్ శాఖ సహకారం వంటి అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు.గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం యువతను సరైన దారిలో నడిపించడం మత్తు పదార్థాల నియంత్రణ అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సర్పంచ్ రామన్న,ఎస్సై దృష్టికి తీసుకెళ్లారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ వారు గ్రామపంచాయతీ సమన్వయంతో పని చేయాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తామని శాంతి భద్రతల పరిరక్షణలో గ్రామ ప్రజలు కూడా భాగస్వాములుగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచులు పడాల మల్లా గౌడ్,రాజా గౌడ్,రిక్కుల అంజిరెడ్డి,మద్దుల మల్లారెడ్డి,మద్దుల మనోహర్ రెడ్డి, ప్రభాకర్ చారి దుస్స భాస్కర్, బొప్ప రమేష్,పాలమాకుల రాజేందర్ రెడ్డి,రిక్కుల శేఖర్ రెడ్డి,నరెడ్
