తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు స్థానిక ఉపసర్పంచ్ పెద్దూరీ తిరుపతి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వాడవాడల తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో సంక్షేమ అభివృద్ధిపథకాలు తీసుకువచ్చి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని వికలాంగుల పెన్షన్ గాని వింతౌత్ పెన్షన్ గాని ఆసరా పెన్షన్ గాని కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ రైతుబంధు రైతు బీమా బీసీ బందు మైనార్టీ బందు దళిత బంధు కుల సంఘాలకు కుల వృత్తులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అలాంటిది పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కనీసం మూడు నుంచి ఐదు గంటల కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నందున ఇచ్చిన హామీలన్నీ మరిచిందని అలాంటి మన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని అలాగే మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రియతమ మంత్రి కేటీ రామారావుని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని వాడ వాడలా గడపగడప ప్రచారం చేయడం జరిగిందని తెలియజేశారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఏం సి డైరెక్టర్లు మైనార్టీ మహిళ నాయకులు పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు ఎస్సీ సెల్ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు ఇట్టి ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు