Peddoori Tirupathi Meets Press in Tangellapalli
మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో తంగళ్ళపల్లి సర్పంచ్ అభ్యర్థి పెద్దురీ తిరుపతి పాత్రికేయుల సమావేశం…..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ అభ్యర్థి పెద్దూరీ తిరుపతి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో తిరుపతి మాట్లాడుతూ. తంగళ్ళపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మేరకు తెలియజేయుటఏమనగా నేను మీ తిరుపతిని తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ గా పోటీ చేయుచున్నాను. తంగళ్ళపల్లి గ్రామంలో మీ కండ్ల ముందు ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని కులవృత్తి చేసుకుంటూ నా వంతుగా.వ్యాపారంచేస్తూ ఉన్నాను అలాగే గతంలో గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గా రెండు సార్లుపనిచేసినఅనుభవం ఉంది ఆ సమయంలో గ్రామాన్ని గ్రామ పంచాయతీ నిధులు గ్రామ పంచాయతీకి ఖర్చు పెట్టే విధంగా పనిచేశానని.నా వంతుగా ప్రజలకు ఏ అవసరం వచ్చినా ముందుండి.నడిపించానని గతంలో తంగళ్ళపల్లి గ్రామంలో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాననిచెప్పారు కనుక గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అభివృద్ధి కుంటుపడి.పోయిందనీ. గ్రామంలో మీ అందరి సహకారంతో నాపై మీ ప్రేమతో మీ కుటుంబ సభ్యులు లాగా భావించి. నా యొక్క గుర్తు ఫుట్. బాల్. గుర్తు అని దానిపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అనగా పెద్దూరు తిరుపతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ పేరుపేరునా కోరుచున్నాను. అలాగే గ్రామంలో సర్పంచ్ గా మీ ఆశీర్వాదంతో నన్ను గెలిపించినట్లైతే.తంగళ్ళపల్లి గ్రామంలో. వృద్యాప పింఛన్లు. మంచినీటికి ఇబ్బందులు లేకుండా చూస్తూ. గ్రామానికి వైకుంఠ రథాన్ని అందజేస్తానని వాడ వాడల డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేటట్లు చర్యలు తీసుకుంటాననిగ్రామంలో వాడ వాడల చెత్తసేకరించే విధంగా ఐదు ట్రాక్టర్లను అందుబాటులోకి తెస్తానని. యువతకు వారికి అవసరమైన ప్రోత్సాహం అందిస్తూ అన్ని విభాగాల్లో వారికి యువతకు ఏదైనా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నానని వ్యవసాయ అధికారులతో రైతులకు అవగాహన కల్పిస్తూ. రైతులు పండించిన ధాన్యాన్ని తడవకుండా షెడ్లు ఏర్పడు చేస్తానని. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా వస్తానని మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానని. మాట ఇచ్చి మరల తప్పించుకునే రకం నాది కాదు అని మీ అందరి ఆశీస్సులతో గ్రామ సర్పంచిగా పోటీలో ఉన్నానని గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడానికి మీ ముందుకు వస్తున్నానని గ్రామ ప్రజలందరూ ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ద్వారా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళలా నాపై ఉండాలని కోరుకుంటూ. కల్లబొల్లి మాటలు చెప్పి అది చేస్తా ఈది చేస్తానని. చెప్పే మాటలు నమ్మకుండా ఎవరైతే గ్రామాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతారో ప్రజలు మీకు తెలుసునని ఎప్పటికైనామీముందు ఉంటానని. ప్రజలారా మీ ఆశీస్సులకై ముందుకు వస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీలో ఒకడిగా ఉంచుకోవాలని అలాగే ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు యువత తదితరులు పాల్గొన్నారు
