ఖానాపూర్ మండల ముఖ్య నాయకులు
ఖానాపూర్ నేటిధాత్రి
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు మాత్రం తద్యం అని నర్సంపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు గాలి స్పష్టంగా వినిపిస్తుంది. ఖానాపూర్ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మాట్లాడుతూ అదే గతంలో మాధవరెడ్డి ఎమ్మెల్యేగా ఉండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోక నియోజకవర్గం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు నియోజవర్గ ప్రజల మాట, అదే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ప్రాoతాన్ని మోసి 2014 లో నర్సంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ ఓటమి పాలు అయినప్పటికీ పెద్దసారు కేసీఆర్ దగ్గర ఉన్న ఆప్యాయతతో నియోజకవర్గానికి మంత్రుల కంటే ఎక్కువ నిదులు తెచ్చి అభివృద్ధి చేశారని ప్రజల్లో బలంగా వినికిడి.దాంతోనే 2018 ఎన్నికల్లో విజయం సాధించాడు. అప్పటినుండి నర్సంపేటలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే గృహం ఏర్పాటు చేసుకొని విద్య,వైద్య,సాగునీటి రంగాల్లో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ,నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ వారు బాగోగులు కష్టసుఖాలు పాలుపంచుకుంటున్న నాయకుడికే పట్టం కట్టాలని ప్రజల మధ్యలో స్పష్టంగా కనిపిస్తుంది. 2014 ఎమ్మెల్యేగా గెలిచి,మళ్ళీ 2018 ఎన్నికల్లో ఓడిపోయిన మాధవరెడ్డి రెండు పర్యాయాలు ఏనాడు ప్రజల మధ్యలో లేరని నేడు ఎన్నికలు అనగానే అధికార దాహంతో ప్రజల మధ్యలోకి వచ్చాడని ప్రజలు బహిరంగంగా,చర్చించుకుంటున్నారు.నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో,ప్రతి వీధిలో, ప్రతితండాలో పెద్ది సుదర్శన్ రెడ్డి తను చేసిన ‘అభివృద్ధి మార్క్’ ని స్పష్టంగా ప్రజల మధ్యలో వినిపిస్తున్నాడు.ప్రతి గ్రామంలో తనకు బ్రహ్మరథం పడుతున్న విషయం సోషల్ మీడియా వేదికగా బాగా హల్చల్ చేస్తుంది.మొన్నటికి మొన్న ఖానాపురం మండలంలో ఇంటింటి ప్రచారంలొ గ్రామాలలో కదిలివచ్చి “పాకాల గోదావరి జల సాకారుడు” పెద్ది అనే వాయిస్ బలంగా పాతుకుపోయింది ప్రజల మదిలో.ఏ మండలంలో చూసినా కూడా ఇలాంటి వాతావరణమే కనబడుతుంది.గత రెండు రోజుల క్రితం దొంతి మాధవరెడ్డి సొంత మండలం చెన్నారావుపేట సొంత గ్రామమైన “అమీనాబాద్” గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటింటి ప్రచార కార్యక్రమానికి గ్రామం నుండి భారీ మొత్తంలో అనూహ్య స్పందన వచ్చిందంటే పెద్ది “గెలుపు ఖాయం ” అని అర్థమవుతుంది.అదే గ్రామంలో పెద్ది మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు అని ఈ గ్రామంలో అభివృద్ధి చేయకుండా ఆగలేదని ప్రతి వీధిలో సిసి రోడ్లు, మహిళా భవనాలు, కుల సంఘాల కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేయించానని నొక్కి చెప్పారు.
నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి గెలుపు పై ఆశలు లేక వాట్సాప్ గ్రూపులో పెయిడ్ ఆర్టిస్టులను తీసుకువచ్చి పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రధాన నాయకుల గుసగుసలు.ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి విషయానికొస్తే మండల రాజకీయాల్లో అక్కడక్కడ పార్టీలో అసంతృప్తిలో ఉన్నప్పటికీ వారందరినీ ఒక తాడిపైతెచ్చి కలుపుకపోయి విజయం సాధిస్తారని అర్ధమవుతుంది.ఇక ఇద్దరి నాయకుల కుటుంబ నేపథ్యం తీసుకున్నట్లయితే ప్రస్తుత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న నియోజకవర్గం లో కాలుకు బలపం కట్టుకొని మంచి,చెడు ప్రతీ కార్యక్రమంలో అన్నిటికీ హాజరవుతూ పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ,అక్కడక్కడ ఆర్థిక సహాయసహకారాలు అందిస్తూ నియోజకవర్గ ప్రజల్లో మెలుగుతూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ నిత్యం కార్యకర్తల బాగోగులు చూసుకుంటూ ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు ఖాయం అని ప్రజలు కోరుకుంటున్నారు.