
దేవరుప్పుల నేటిధాత్రి ఫిబ్రవరి 19
దేవరుప్పుల మండలం,సింగరాజుపల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు మేకపోతుల నరసింహ తల్లి మేకపోతుల సత్తెమ్మ అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకుని మృతురాలి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్. ఈ కార్యక్రమంలో సింగరాజు పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండ మల్లారెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నల్ల యాదగిరి,ఓట్ల శివారెడ్డి, జాటోత్ చంద్రయ్, తాళ్లపల్లి వేణు, జోగు సోమరాజు, అటికం నరసయ్య ఈ కార్యక్రమంలో తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.