
నిజాంపేట: నేటి ధాత్రి
ముగ్గురమ్మల మూలపుటమ్మ కొలిచిన వారికి కొంగు బంగారం వరాలిచ్చే తల్లి పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన ముదిరాజ్ కులస్తులు. మండల కేంద్రంలో శుక్రవారం రోజున పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలంతా ఎలాంటి ఇబ్బందులు పడకుండా పెద్దమ్మ తల్లి కాపాడాలని తెలిపారు. అనంతరం సాలువాతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని లక్ష్మి ప్రతీక కూచిపూడి నాట్యం చేసి మన సాంస్కృతిని తెలియపరిచింది. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్, బిజెపి మండల అధ్యక్షులు చంద్రశేఖర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పంజా బాబు, మహేందర్ జాల పోచయ్య, జిపి స్వామి, గేరుగంటి బాబు తదితరులు పాల్గొన్నారు.