నర్సంపేట,నేటిధాత్రి :
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జీ నాగయ్య పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఈ నెల 10 నుండి 17 వరకు నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐఎంఏ హాల్ లో సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన సభ నిర్వహించారు.ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ 1945నుంచి1951 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటo కొనసాగుతున్న క్రమంలో ఆనాటి ప్రధాని నెహ్రు సైన్యం, నైజం ప్రభుత్వ పోలీసులు దౌర్జన్యాలకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రజలు 4000 మంది మరణించారని అన్నారు. ఈ నేపథ్యంలో ఆ పోరాటం ద్వారా తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూములను సాధించుకొని భూమి లేని పేదలందరికీ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆ పోరాటంలో మొదటి అమరుడు దొడ్డి కొమరయ్య కాగా చాకలి ఐలమ్మ ఆంధ్ర మహాసభ ద్వారా పోరాటం నిర్వహించగా నేడు అదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ప్రజలు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య సమ్మయ్య,ముంజల సాయిలు, అనంతగిరి రవి, గడ్డమీది బాలకృష్ణ,కందికొండ రాజు, కుదురుపాక రాములు,మద్ది అశోక్,ఎండి ఫారిదా, వజ్జంతి విజయ,జగన్నాధం కార్తీక్,బిట్ర స్వప్న,ఉదయగిరి నాగమణి, తాళ్లపల్లి ప్రవళిక,గణిపాక ఇంద్ర,బి లక్ష్మి, కలకోటి అనిలు, గణిపాక విలియం కేరి, తదితరులు పాల్గొన్నారు.