టెలికం బోర్డ్ మెంబర్ ఆకుల రమేష్
నిజాంపేట: నేటి ధాత్రి
పసుపు బోర్డు రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందని టెలికం బోర్డ్ మెంబర్ ఆకుల రమేష్ అన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ పసుపు బోర్డును నిజాంబాద్ జిల్లాకు తీసుకువస్తానని హామీ ఇవ్వడం జరిగింది అన్నారు. దానికి అనుకూలంగా 2023 అక్టోబర్ 1 మహబూబ్ నగర్ బహిరంగ సభలో నరేంద్ర మోడీ తెలంగాణకు జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిజాంబాద్ జిల్లా రైతుల చిర వాంఛ కోరిక పసుపు బోర్డు అని ఆయన అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో అక్కడి ప్రాంత రైతులకు ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మాస్టర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, సీనియర్ నాయకులు వెలుముల సీద్ద రాములు, రమేష్ లు ఉన్నారు.