Peaceful BC Bandh in Parakala
పరకాలలో బందు ప్రశాంతం
పరకాల నేటిధాత్రి
తెలంగాణ లో బీసీ లకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని బీసీ నాయకులు ఇచ్చిన బంద్ లో శనివారం రోజున పట్టణంలోని వ్యాపారస్థులు,ప్రజలందరు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ బంద్ కు పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలతోపాటు పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.విద్యాసంస్థలు,కాలేజీలు సెలవు ప్రకటించాయి.
