
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యూ) ఏర్పడి అక్టోబర్ 12,13 తేదీలతో 50 వసంతాలు (సంవత్సరాలు) పూర్తి చేసుకోబోతున్నాఈ సందర్భంగా గోడపత్రికలను గుండాల మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల నందు పిడిఎస్ యూ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి జె గణేష్ మాట్లాడుతూ
భారత జాతీయ ఉద్యమ నాయకుల మరియు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడు చేగువేరా ల స్ఫూర్తితో 1974లో ఏర్పడిన విద్యార్థి సంఘం పిడిఎస్ యూ గత 50 సంవత్సరాలు గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలుకొని నేటి రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ విద్యార్థుల చేతుల్లో తిరుగుబాటు శక్తిగా నిలిచింది. సమాజంలో ఎంతో మంది ప్రగతిశీల వాదులను తయారు చేసింది విద్యా కాషాయీకరణ, ప్రైవేటు, కార్పోరేటికరణలను వ్యతిరేకిస్తూ నాణ్యమైన విద్య, అందరికీ సమానమైన విద్య కై పోరాటాలను కొనసాగిస్తుంది. ఈ తరుణంలో 50 వసంతంలు పుర్తి చేసుకుంటున్నా సందర్భంగా జాతీయ కార్యవర్గం ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలో సదస్సులు సమావేశాలను నిర్వహించుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమం నాయకులు రామకృష్ణ. అఖిల. దీపిక. వివేక్. శ్యామల తదితరులు పాల్గొన్నారు.