PDS Rice Seized in Police Raid
చాపలబండలో పీడీఎస్ బియ్యం పట్టివేత
బియ్యం, వేయింగ్ మెషిన్, ట్రాలీ ఆటో స్వాధీనం
దుగ్గొండి,నేటిధాత్రి:
దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో బొగ్గుల ప్రశాంత్ అనే వ్యక్తి వద్ద పీడీఎస్ బియ్యం బస్తాలు, వేయింగ్ మెషిన్ మరియు ట్రాలీ ఆటో ఉన్నట్లు గుర్తించినట్లు ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తెలిపారు.అతని వద్ద సుమారు 50 కిలోల పీడీఎస్ బియ్యాన్ని, వేయింగ్ మెషిన్‌ను మరియు ట్రాలీ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
