కరెంట్ చార్జీల బిల్లులు ఫోన్ పే వివిధ ఆన్లైన్ యాప్స్ ద్వారా చెల్లించండి

ఎఈ రాంమూర్తి

మంచిర్యాల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి:

మంచిర్యాల జిల్లా // నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో
కరెంట్ చార్జీల బిల్లులు ఫోన్ పే గూగుల్ పే తదితర యాప్స్ ద్వారా వినియోగదారులు చెల్లించాలని ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్న నస్పూర్ ఎఈ రాంమూర్తి .

బుధవారం రోజున సీసీసీ, తీగల్ పహాడ్, శ్రీరాoపూర్ కాలనీ మరియు నస్పూర్ ఏరియాలలో కిరాణా దుకాణాలలో, వెల్డింగ్ షాప్, రైస్ మిల్లు లలో, గ్రృహ సముదాయాలలో విద్యుత్ బిల్లులు విధిగా చెల్లించాలని కోరారు .

చాలామంది కరంటు ఆఫీస్కు వచ్చి బిల్లులు చెల్లించడం లేదా విద్యుత్ అధికారులు ఇంటికి వస్తే విద్యుత్ బిల్లులు కట్టడం లాంటివి చేస్తున్నారు.

ఇలా కాకుండా ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ ఉన్నాయి .అయితే కొందరికి విద్యుత్ బిల్లులు ఏ విధంగా చెల్లించాలో తెలియక సతమతం అవుతున్నారు. అలాంటి వారి కోసమే విద్యుత్ శాఖ తరపున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యుత్ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!