గూగుల్ సెర్చ్​ టాప్ లో పవన్, IPL!

2024లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితా రిలీజ్ అయింది. అయితే అందులో ఈ ఏడాది అత్యధికంగా వెతికన టాపిక్స్​లో క్రికెట్ లవర్స్​ ఎంతో ఇష్టంగా చూసే ఐపీఎల్‌, టీ20 వరల్డ్‌ కప్‌ టాప్​లో ఉన్నాయి. వీటితో పాటు సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలూ ఉన్నాయని తెలుస్తోంది. దివంగత టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా గురించి కూడా చాలా మంది నెటిజన్లు సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక సినిమాల విషయానికొస్తే మూవీ లవర్స్ మోస్ట్ సెర్చ్​డ్​ టాపిక్ లిస్ట్​లో బాలీవుడ్ మూవీ ‘స్త్రీ2’ పేరు టాప్​లో ఉంది. ఇక ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 AD’, ‘సలార్‌’ గురించి ఎక్కువ మంది సెర్చ్‌ చేశారని గూగుల్ వెల్లడించింది. వీటితో పాటు ప్రశాంత్‌ వర్మ – తేజా సజ్జా కాంబోలో తెరకెక్కిన ‘హనుమాన్‌’ కూడా ఈ లిస్ట్​లో ఉంది. ‘మీర్జాపూర్‌’, ‘హీరామండీ’ షోస్ గురించి కూడా గూగుల్​లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసినట్లు తేలింది.

రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ పలికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేశ్‌ ఫొగాట్‌ గురించి కూడా చాలా మంది వెతికారని గూగుల్‌ వెల్లడించింది. ముఖ్యంగా మెస్ట్​ సెర్చ్​డ్​ పర్సన్స్​ లిస్ట్​లో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. బిహార్‌కు చెందిన నీతీశ్‌ కుమార్‌, చిరాగ్‌ పాసవాన్‌ గురించి కూడా ఎక్కువ మంది సెర్చ్ చేశారని తెలుస్తోంది. మరోవైపు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా టాప్‌ సెర్చ్‌​లో ఉన్నారు. వ్యక్తుల లిస్ట్​లో ఆయన ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!