`పవన్ పూటకో వేషం తెలంగాణలో చెల్లదు!?
`పవన్‌ను వెనుకేసుకొచ్చే వారి ఆటలు కూడా సాగవు
`తెలంగాణ అంటే నవ్వులాట రాజకీయాలు కాదు
`ఉద్వేగరితమైన తెలంగాణ రాజకీయాలను కలుషితం చేస్తేమంటే చూస్తూ ఊరుకోం
`ఇసంత రమ్మంటే ఇళ్లంత నాదే అనే రకం!
`జనసేన పుట్టింది తెలంగాణలో అంటే తరిమి, తరిమి కొడతాం!
`నీ ఊసరవెళ్లి రాజకీయాలు సాగవు!
`ఉద్యమ కారుల ప్రాణాలు త్యాగం చేసిన నేల
`కొట్లాడి సాధించుకున్న తెలంగాణపై గద్దలు వాలితే ఈకలు పీకేస్తాం
`కన్నెత్తి చూస్తే గుడ్లతో గోలీలాడతాం
`ఉద్యమ కారుల తనువులు చాలిస్తుంటే రెచ్చ గొట్టిన చరిత్ర పవన్‌ది
`తెలంగాణ విడిపోతే 11 రోజులు అన్నం తినలేదని చెప్పి ఏపిలో ఓట్లు అడుక్కున్నావ్
`తెలంగాణ వ్యతిరేకులకు చోటు లేదు
`అవకాశవాది పవన్‌కు అసలే వుండదు
`తెలంగాణ అంటే ఆత్మ గౌరవం
`పూటకో మాట మాట్లాడే పవన్ అవకాశ రాజకీయం
`పుట్టిన గడ్డ ఏపికి ముందు సేవ చెయ్యి!
`నమ్మి గెలిపించినందుకు అభివృద్ధి చేయి
`తెలంగాణ జోలికొస్తే తరిమి కొడతాం
`ప్రాంతేతరుడి పొలిమేర వరకు తరమాలని చెప్పిన కాలోజీ వారసులం
హైదరాబాద్,నేటిధాత్రి:
అయ్యోనివా..నువ్వు అవ్వోనివా..తెలంగాణకు నువ్వు పాలోడివా అన్న పాట ఇంకా తెలంగాణ జనం మర్చిపోలేదు. ఉద్యమ పురిటి వాసనలు తెలంగాణలో పోలేదు. తెలంగాణ అంటేనే ఉద్యమ రూపం. కలిసి సాగుదామంటే తెలంగాణలో వున్నంత సఖ్యత ఎక్కడా వుండుదు. కాని ఎప్పుడైతే పెత్తనం ఆలోచనలు ఏపి నాయకులు ఎవరు చేసినా తెలంగాణ సమాజం చీరి చింతకు కడుతుంది. అరవై ఏళ్లపాటు నిరంతరం పోరాటం చేసి, వేలాది మంది అమరులైన త్యాగం మళ్లీ ఏపి నాయకులు ఇక్కడ రాజకీయం చేయడానికా? తెలంగాణను మళ్లీ ఆగం చేయడానికా? నరనరాల్లో మనుషులే కాదు, జీవ జాతులన్నీ, చెట్టు చేమ, పుట్టా, ఆకు, అలము కూడా తెలంగాణ ఉద్యమ దీరత్వాన్ని నింపుకొని వున్నవే. వాటిని కదిలించే ప్రయత్న ఎవరు చేసినా పసిగడుతుంటాయి. పొలిమేర ఆవలకు తరిమేస్తుంటాయి.అందుకే కాలోజీ అన్నట్లు ప్రాంతేతరుడు తెలంగాణలో వేలు పెడితే ప్రాంతం పొలిమేర వరకు తరిమేయమన్నారు. అదే తెలంగాణ సమాజం ఆచరిస్తోంది. తెలంగాణ సాదించి అదే చేస్తోంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వుంటే, తెలంగాణమీద కుట్రలు చేసి, మళ్లీ మర్రి చూడకుండా ఏపికి వెళ్లిన చంద్రబాబును చూసి పవన్ కల్యాణ్ నేర్చుకోవాలి. జనసేన తెలంగాణలో పుట్టిందని చెబితే తెలంగాణ పార్టీ అయిపోదు. మది నిండా విషపు ఆలోచనలు నింపుకునే ఏపి నాయకులను తెలంగాణ సమాజం ఇక వెయ్యేళ్లయినా క్షమించదు. ఇలాగే చిరంజీవి మెగాస్టార్ అని లేని కిరీటాన్ని పెట్టుకొని , ఎన్టీఆర్ గెలిచారు. నేను గెలవనా? అనుకొని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ప్రజారాజ్యం పెట్టుకున్నాడు. ఏమైంది? ఎన్టీఆర్‌కు, చిరంజీవికి నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుందని విసిరి అవతల పడేశారు. తెలంగాణ ప్రకటనకు ముందు సామాజిక తెలంగాణ అని ప్రజలను నమ్మించి మోసం చేయాలని చిరంజీవి చూశారు. అసలు సామాజిక తెలంగాణ అంటే అర్దమేమిటంటే నీళ్లు నమిలాడు. తెలంగాణ ప్రకటన రాగానే జై సమైక్యాంద్ర అన్నాడు. అలాంటి చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ ఏపి నాయకుడే అవుతాడు తప్ప, తెలంగాణ నాయకుడు ఎప్పుడూ కాదు. ఎందుకంటే వారి మనసు వేరు, నిజం వేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపి ప్రజలే పవన్‌ను నమ్మలేదు. ఒక్క సీటు కూడా గెలిపించలేదు. పవర్ స్టార్ అని తనకు తానే గొప్పలు చెప్పుకొని, లేని స్టార్ డ్రమ్‌ను చూపించుకునేందుకు ఎన్ని ఎత్తులు వేసినా ఏపి జనం నమ్మలేదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు ఇవ్వలేదు. దాంతో అసలైన పవన్ బైటకు వచ్చాడు. అబద్దాలు చెప్పితే తప్ప గెలవలేనని నిర్ణయం తీసుకున్నాడు. చెప్పిన మాటే చెప్పి, చెప్పి, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం వాడినే అంటూ మాట్లాడి అమాయకులైన ప్రజలను నమ్మించాడు. అయితే ఒంటరిపోరుతో గెలవలేదు. కూటమి జట్టుకట్టి 20 సీట్లు గెలిచారు. అలాంటి పవన్ జనసేన పుట్టింది తెలంగాణలో అంటూ పల్లవి పాడితే తెలంగాణ జనం నమ్మరు. ఆదరించరు. తెలంగాణకు పవన్ కూడా ఒక శత్రువే. తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజుల పాటు ఉప వాసం వున్నానని, అన్నం తినాలనిపించలేదని అన్నాడు. ఇంట్లోనుంచి బైటకు రావాలంటే కూడా మనసొప్పలేదన్నాడు. తెలంగాణపై అంతటి విషం పెంచుకున్న పవన్ తెలంగాణలో వేలు పెట్టాలని చూసినా ప్రజలు సహించరు.
ఆ మధ్య షర్మిల కూడా తెలంగాణలో పార్టీ పెట్టింది. నాలుగు రోజులు హడావుడి చేసింది. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట సూటిగా చెప్పారు. ఏపికి చెందిన వారికి తెలంగాణలో రాజకీయం ఏమిటి? కొట్లాడి సాదించుకున్న తెలంగాణలో మీ ఉనికికి చోటెక్కడిది. రాజకీయం కోసం తెలంగాణలో ప్రగతి, అభివృద్ది విషయంలో మాట్లాడుకోవడానికైనా, పొట్లాడుకోవడానికైనా మేం చాలా మందిమి వున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఏపి నాయకులు వేలు పెడితే సహించమని స్పష్టం చేసిన సందర్భం వుంది. పిపిసి. అధ్యక్షుడుగా వున్నప్పుడే రేవంత్‌రెడ్డి షర్మిల విషయంలో అలాంటి అలా స్పందించిన రేవంత్ రెడ్డి, ఏ ఇతర ఏపి నాయకులు పెత్తనానికి వచ్చిన సహించరు. అలాగే తెలంగాణ మేధావి వర్గం కూడా వారిని ఆహ్వనించదు. ఒకవేళ బిజేపి తన ఉనికికోసం, సీట్ల సాధన కోసం, అధికారం కోసం జనసేనతో కలిసి వచ్చినా దీర్ఘ కాలంలో తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందే తప్ప మేలు జరగదు. తెచ్చుకున్న తెలంగాణకు బిజేపి ద్రోహం చేసినట్లే అవుతుంది.
ఆంధ్రా పార్టీలు, నాయకులు ఎప్పుడూ తెలంగాణ బాగు కోరుకోరు. తెలంగాణ బాగు పడాలని కోరుకోరు. ఏపి ప్రజలకన్నా,తెలంగాణ ప్రజలు సంతోషంగా వుండాలని ఎప్పుడూ కోరుకోరు. అదే నిజమైతే అరవై ఏళ్లపాటు తెలంగాణను గోస పెట్టకపోయేవారు. తెలంగాణ నాయకులను పాలనలో సమ ప్రాదాన్యం కల్పించేవారు. కేవలం సీట్లు ఎక్కువున్నాయన్న మందబలంతో ఆనాటి నుంచి తెలంగాణ వచ్చేదాక అన్యాయమే చేశారు. తప్ప ఏనాడు రాజకీయంగా తెలంగాణను ఎదగనీయలేదు. ఆర్ధిక పరిపుష్టి కల్గించలేదు. తెలంగాణ రైతును ఆదుకోలేదు. తెలంగాణను ఏ రంగంలో ఎదగనీయలేదు. అన్ని రంగాలను ఆగం చేశారు. తెలంగాణను ఆగం చేశారు. అందుకే 1969 ఉద్యమం వచ్చింది. వందలాది మందిని కాల్చి చంపారు. తెలంగాణ ఉద్యమాన్ని కర్కషంగా అణిచివేశారు. తెలంగాణ నాయకులు చేతనే తెలంగాణ కంట్లో పొడిపించారు. అవకాశవాద నాయకులను అడ్డం పెట్టుకొని ఆధిప్యతం చెలాయించారు. తర్వాత కూడా ఆరని మంటలా తెలంగాణ ఉద్యమం సాగుతూనే వచ్చింది. 2000 సంవత్సరం నుంచి మళ్లీ కేసిఆర్ రూపంలో ఉద్యమం మొదలైంది. ఉప్పెనలా మారింది. తెలంగాణ వచ్చింది. ఉద్యమ కాలంలో అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు అనేకం చేశారు. అణిచివేశారు. కేసులు పెట్టారు. ఉద్యమకారులను జైలు పాలు చేశారు. తెలంగాణ యువకులు ఆత్మాహుతి చేసుకుంటున్నా కనికరించలేదు. ఎందుకంటే ఒక ప్రాంతం మీద పెత్తనం అంటే నాయక వర్గాలకు తరతరాల ఆదాయమే కాదు, పదవీ వ్యామోహం కూడా దాగి వుంటుంది. ఒక ప్రాంత నాయకులు మరో ప్రాంత నాయకులను బానిసలుగా చేసుకొని రాజకీయం చేయడం అహాంకారానికి నిదర్శనం. అది తట్టుకోలేని తెలంగాణ సమాజం 2000 తర్వాత మరింత ఎదురుతిరిగింది. తెలంగాణ సాధించుకున్నది. దాంతో ఆంధ్రా నాయకులకు కంటి మీద కనుకులేదు. హైదరాబాద్‌ను వదిలివెళ్లాలంటే మనసొప్పడంలేదు. నిజానికి ఏపి నాయకులకు ఆ ప్రాంతం మీద మమకారం లేదు. కాని పెత్తనం కావాలి. పదవులు కావాలి. అందుకే ఇప్పటికీ ఏపికి చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా నాలుగు రోజులు ఏపిలోవుంటారు. మిగతా మూడు రోజులు తెలంగాణలో వుంటారు. ఆస్ధులన్నీ ఇక్కడుంటాయి. పెత్తనం అంతా అక్కడ చేస్తారు. ఈ తిరుడుగు కన్నా, మళ్లీ తెలంగాణను వశం చేసుకోవాలన్న కుట్రను తెలంగాణ వచ్చిన మరుసటి రోజు నుంచే మొదలు పెట్టారు. ఇక మేక వన్నె పులి లాగా తెలంగాణలో వుంటే తెలంగాణ ప్రజలను, ఏపిలో వుంటే ఏపి ప్రజలను నమ్మించేలా సినిమా డైలాగులు చెప్పి ఏపి డిప్యూటీసిఎం. పవన్ నమ్మిస్తూనే వున్నారు. ఒంటరి రాజకీయం కలిసి రావడం లేదని తెలుసుకొని , కూటమి జట్టు కట్టి, బిజేపిని ఒప్పించి, తెలుగుదేశంతో జతకట్టి ఎన్నికలకు వెళ్లారు. ఇచ్చిన సీట్లు తీసుకున్నాడు. బిజేపి తెలుగుదేశం పుణ్యమా? అని గెలిచాడు. ఇక అప్పటి నుంచి తెలంగాణలో కూడా రాజకీయం చేయాలన్న ఆసక్తిని పవన్ పెంచుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపికి చెందిన ఏ నాయకుడు జై తెలంగాణ అనడు. అంటే ప్రత్యేక భావన ఉట్టిపడుతుంది. ఆ మాట అనాలంటే ధైర్యం కావాలి. అది నిజాయితీ వున్న నాయకులే అనగలరు. కాకపోతే మోసం చేయాలనుకునే వారు కూడా అనగలరు. అదే దారిలో నడిచే పవన్ ఇంత వరకు జై తెలంగాణ అనేలేదు. కాని తెలంగాణలో రాజకీయం చేయాలని కలలు కంటున్నారు.