
Pawan Kalyan VS Patlolla Karthik Reddy
హిందీ భాష వివాదం.. పవన్‌కళ్యాణ్‌కి గట్టి కౌంటర్ ఇచ్చిన పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా హిందీ భాష వివాదం నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందీకి మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే.
పవన్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కొంతమందికి ఎప్పుడు అర్థమవుతుంది?! హిందీని రుద్దడం కేవలం భాష గురించే కాదని. ఇది ఉత్తర(ఆర్యులు) భారతదేశంకి చెందిన వారు దక్షిణ (ద్రావిడ) భారతదేశంపై తమ ఆధిపత్యాన్ని చెలాయించడమే. వారు తాము ఉన్నతమైనవారమని, మనం తక్కువవారమని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు హిందీ/ఉర్దూ (రెండు ఒకటే) చాలా బాగా వచ్చు, మరి ఉత్తరాదిలో నివసించే ఎవరైనా తెలుగులో మాట్లాడతారా? వెన్నెముక లేనివారు మన గొంతులను వినిపిస్తే, దక్షిణాది గొంతు ఎప్పటికీ వినిపించదంటూ పవన్‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడు.