పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
జిల్లా అధికార ప్రతినిధి మిడతపల్లి యాకయ్య మాదిగ డిమాండ్
కొత్తగూడ, నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడమండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చింత అనిల్ మాదిగ ఆధ్వర్యంలో
ఆంధ్ర ప్రదేశ్ రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మహబూబాబాద్ జిల్లా అధికార ప్రతినిధి మిడతపెల్లి యాకయ్యమాదిగ మాట్లాడుతూ భారతదేశం
ఒక లౌకిక దేశం భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుండి క్రైస్తవ సంఘాలు సంస్థలు మరియు సమాజం లో కుల మత పేద ధనిక మేధావి నిరాక్షరాశులనే భేదం లేకుండా అందరి మధ్య నిస్వార్ధంగా వైద్య విద్య మరియు సామాజిక రంగాలలో ప్రభుత్వంతో సమానంగా అఖండ సేవలందిస్తున్నాయి
ఈనాటికి బాధ్యత మైన క్రైస్తవ సమాజం నిస్వార్థ సేవలు అందిస్తూనే ఉంది స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా క్రైస్తవ సమాజంపై హత్యలు అత్యాచారాలు మాత్రం మారలేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన
రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 25 (1) అధికరణాలను అనుసరించి దేశంలోని పౌరులందరికీ తమకిష్టమైన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛను కల్పించింది కానీ కొంతమంది రాజకీయ స్వార్ధపరులు
రాజ్యాంగ చట్టాలను ఉల్లగించి తమ స్వార్థం కోసం మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తూ శాంతియుతంగా ఉన్నటువంటి భారతదేశాన్ని అశాంతి యుతంగా మారుస్తున్నారు మొన్న మణిపూర్ ఘటన
లో కూడా ఆడ మగ పిల్ల పాపలు అనే తేడా లేకుండా చిత్రహింసలకు గురి చేశారు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల ను హత్య చేసి కొట్టి పడేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించి కేసును తప్పుదోవ పట్టించేవిధముగావ్యవహరిస్తున్నారు.
పాస్టర్ ప్రవీణ్ డెడ్ బాడీని పోస్టుమార్టం చేసి రిపోర్టులు న్యాయబద్ధంగా ఈయకపోతే క్రైస్తవ సమాజం శాంతియుతం మానుకొని శాంతి భద్రతలకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనుక దోషులు ఎవరైతే ఉన్నారో వారికి చట్టపరమైన శిక్ష పడే విధంగా ఆంధ్ర రాష్ట్ర డిజిపి హోం శాఖ మంత్రి అనిత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గార్లు మానవిక కోణంలో విచారణ జరిపి పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో ఎంఎస్పి మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల ప్రేమ్ సాగర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రచార కార్యదర్శి బాల్య శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి తాళ్ళపెల్లి ప్రభాకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి మిడతపల్లి విక్రమ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల కోశాధికారి గుడెల్లి రవి, ఎర్ర రామచంద్రు, మచ్చ రాజు తదితరులు పాల్గొన్నారు