ఏపీజీవీబీ బ్యాంకు మిత్ర వద్ద మైక్రో ఎటిఎం ద్వారా పాసుబుక్కుల ప్రింటింగ్ సేవలు

నిజాంపేట నేటి ధాత్రి ఏప్రిల్ 8

మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని నస్కల్ గ్రామంలో బ్యాంక్ పాస్ బుక్ ప్రింటింగ్ దేశంలోనే మొదటిసారిగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా మైక్రో ఏటీఎం ద్వారా సిద్ధిపేట రీజియన్ నిజాంపేట్ బ్రాంచ్ ఏపీజీవీబీ బ్యాంక్ మిత్ర అవదుత మురళి వద్ద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పాస్ బుక్ ప్రింటింగ్ సేవలు ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ మురళి కృష్ణ మాట్లాడుతూ గ్రామంలోనే బ్యాంకు సేవలు లభిస్తాయని అన్నారు అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ యొక్క సేవలు బ్యాంకు బ్యాంకు మిత్ర వద్ద సేవలు అందించబడతాయని అన్నారు అలాగే
పాస్ బుక్ ప్రింట్ తీసుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ఐరిక్స్ ఛానల్ మేనేజర్ డి వెంకటేష్ బ్యాంకు మిత్ర కీసరి రవి నిజాంపేట బ్యాంక్ మిత్ర బృందం గ్రామ ప్రజలు డ్వాక్రా మహిళలు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!