
ఎంపిడివో గా భాద్యతలు స్వీకరించిన పసరగొండ రవి .
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పసరగొండ రవి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు గతంలో విధులు నిర్వహించిన నరసింహమూర్తి ఇటీవల పదవి విరమణ పొందడంతో ఆయన స్థానంలో ఎంపీ ఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవికి ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వహించేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేయగా. బాధ్యతలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా కార్యాలయ సూపర్డెంట్ ఎండి అబిద్ అలీ, సీనియర్ అసిస్టెంట్ శారదామని, నూతన బాధ్యతలు చేపట్టిన రవికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ శైలజ, పరంజ్యోతి, టైపిస్ట్ గంగాధర్, ఈ పంచాయతీ ఆపరేటర్ రఘువరన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.