దశ దిన కర్మ కు హాజరు అయిన పార్వతి రమేష్ నాయక్
మరిపెడ నేటిధాత్రి.
బహుజన్ సమాజ్ పార్టీ డోర్నకల్ నియోజక వర్గ ఇన్చార్జి పార్వతి రమేష్ నాయక్ అనెపురం రెవెన్యూ గ్రామ పంచాయతీ యలమంచిలి తండా లో ఇటీవల స్వర్గస్థులు అయిన బాణోత్ లాలమ్మ దశ దిన కర్మ కు హాజరు అయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారి కుటుంబానికి సద్గురువు సేవాలాల్ మహారాజ్ మరియు సప్త భవాని మాతల మనో ధైర్యం ప్రసాదించాలి అని కోరారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బానోత్ భద్రు నాయక్, వీరన్న నాయక్, శ్రీను నాయక్ అమ్మ అయిన లాల్లమ్మ తొలిదశ అనేపురం రెవెన్యూ గ్రామ నాయకులు అన్నారు, ఈ కార్య క్రమం లో లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్,బహుజన్ సమాజ్ పార్టీ మరిపెడ మండల సెక్రటరీ గుగులోత్ మోహన్ నాయక్, తండా నాయకులు భీమా నాయక్,సిరి నాయక్, లాలు నాయక్ , కీరు నాయక్,చందు నాయక్, రామ నాయక్, తదితరులు పాల్గొన్నారు.