మధుసూదన్ రెడ్డి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో ఆదివారం రోజున మధ్యాహ్న కాల సమయంలో పద్మశాలి భవనం నందు పరకాల మండల మరియు రూరల్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని పరకాల మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి అన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణకు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజానీకాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న మాట వాస్తవమని జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం మరో కొత్త పన్నాగం పని మన పార్టీ కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేస్తూ,పార్టీ మారమని ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని ఇలాంటి పరిస్థితిలో అన్ని స్థాయిల పార్టీ వర్గీయుల కోరిక మేరకు మనలో ఆత్మస్థైర్యం నింపుటకు మన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా హాజరు కాబోతున్నారు.కావున పార్టీ ప్రజా ప్రతినిధులు సొసైటీ, మాజీ మార్కెట్ చైర్మన్లు సభ్యులు,మండల,గ్రామ పార్టీ, అనుబంధ కమిటీల అధ్యక్ష కార్యదర్శులు,నాయకులు,కార్యకర్తలు,తప్పకుండా హాజరు కావాలని మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు.