
`కారు సైనికులు పార్టీ పరిరక్షకులు
`ఉద్యమ కాలం నాటి నిప్పు కణికలు
`తెలంగాణకు వెలుగునిచ్చే ఉద్యమ వేదికలు
`పార్టీని కాపాడే స్యయం సిద్దులు
`గులాబీ పరిమళలాలు నాయకులే!
`బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమ పోరు వీరులు
`పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న శ్రామికులు
`పదవుల కోసం ఆశపడిరది లేదు
`పార్టీ మీద అలిగిన సందర్భం పదేళ్లలో కనిపించింది లేదు
`తెలంగాణ కోసమే బీఆర్ఎస్ సైనికుల త్యాగాలు
`తెలంగాణకు శ్రీరామ రక్షగా నిలుస్తున్న వారధులు
`తెలంగాణ సారధి కేసీఆర్ ఆచరణలకు సాక్ష్యాలు
`కేసీఆర్ పిలుపుకు సింహనాదాలు
`పార్టీ యంత్రాంగం కోసం ఎదురు చూస్తున్న చకోర పక్షులు
`పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆత్మీయులు
`వారి త్యాగాలే పార్టీకి తరతరాలకు నిదర్శనాలు
`ఇప్పటికైనా పార్టీ నిర్మాణం చేయండి
`అధికారంలో వున్నప్పుడు పార్టీ మీద దృష్టి పెట్టలేదు
`కార్యకర్తలందరూ పార్టీని భుజాల మీద మోస్తున్నారు
`పార్టీ పదవులు అప్పగిస్తే మరో వందేళ్లకు పునాదులు వేస్తారు
`తరతరాల తెలంగాణ చరిత్రకు శ్రీకారం చుడతారు
`కేసీఆర్ కీర్తికి కిరీటాలౌతారు
`కేసీఆర్ ను కొలిచే భక్తులుగా పార్టీకి సేవలు చేసుకుంటారు
ఏ పార్టీలోనైనా సరే నాయకులకు ఒక మాట ఎప్పుడూ మాట్లాడుతుంటారు. అదే..నేను పార్టీకి సామాన్య కార్యకర్తను మాత్రమే. అంటారు. అది నిజమా? కాదు..ముమ్మాటికీ కాదు. ఒక నాయకుడు ఒక కార్యకర్తగా మాత్రమే వుండాలని ఎప్పుడూ కోరుకోడు. మరి కార్యకర్త ఎందుకు ఎల్ల కాలం కార్యకర్తగానే వుంటున్నాడు. ఎదుగూబొదుగూ లేని సంసారం అన్నట్లు ఒక కార్యకర్త జీవితాంతం కార్యకర్తగానే మిగిలిపోయే నాయకులు చాలా మంది వున్నారు. అలాంటి కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు. ఒక్క మాటలో చెప్పాలంటే సైనికులు. పార్టీని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్లు. పార్టీ కోసం పని చేయాల్సి వస్తే కుటుంబాన్ని కూడా కాదనుకొని పార్టీ కోసం పనిచేస్తారు. సభలు,సమావేశాలున్నాయంటే వ్యక్తిగత పనులు వదిలేసుకుంటారు. పార్టీ కోసం సమయం కేటాయిస్తారు. మరి వారికేం మిగులుతుంది. అదంతే..ఒక తృప్తి. కార్యకర్త అనే సామాన్యుడికి పార్టీ నుంచి వచ్చేదేమీ వుండదు. ప్రభుత్వాల నుంచి ఒరిగేదేమీ వుండదు. ఆ పార్టీల నాయకులంటే అభిమానం మాత్రమే వారికి వుంటుంది. నాకు కాంట్రాక్టులు ఇవ్వమని కోరడు. ప్రభుత్వ పధకాల అమలలో కూడా త్యాగం చేస్తుంటారు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందాలని కోరుకుంటాడు. ఎన్నికలు వచ్చాయంటే చాలు. ఇక తన పనులన్నీ పక్కన పెట్టేస్తాడు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీకోసం పనిచేస్తాడు. ఆ నాయకుడిని గెలిపించేందుకు ఎంతో శ్రమిస్తాడు. ఇటు ప్రచారం సాగిస్తుంటాడు. అటు ప్రత్యర్ధుల ఎత్తులు,పైఎత్తులు, వ్యూహాలను అంచనా వేస్తుంటాడు. లేదా తెలుసుకుంటుంటాడు. పార్టీ నాయకులు చేర వేస్తుంటాడు. మొత్తానికి పార్టీని గెలిపించాలన్న తపనతో పనిచేస్తాడు. ఆఖరుకు పార్టీ గెలిచినా, ఓడినా కూరలో కరివేపాకౌతుంటాడు. ఇదీ స్ధూలంగా ఒక కార్యకర్త జీవితం. నాయకులు బాగున్నావా? అని పలకరిస్తేలు చాలు సంబరపడతాడు. బంతిలో పక్కన కూర్చోబెట్టుకుంటే జీవితాంతం సేవ చేస్తుంటాడు. ఇదీ కార్యకర్త చిత్తశుద్ది. అందుకే నాయకులు పార్టీలు మారినా, కార్యకర్తలు మాత్రం పార్టీకి స్ధిరంగా వుంటారు. ఎంత పెద్ద నాయకుడైనా సరే పార్టీ మారుతంటే వారి వెంట వెళ్లేందుకు అసలైన క్యార్యకర్త ఇష్టపడడు. తన జీవితమంతా పార్టీకోసమే పనిచేస్తాడు. అలాంటి కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీకి కొన్ని లక్షల మంది వున్నారు. ఇప్పుడుంటే ఆ కార్యకర్తలు రాజకీయాలు చేస్తున్నారు. కాని బిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటినుంచి 2014 వరకు అటు ఉద్యమం చేశారు. ఇటు రాజకీయం చేశారు. రెండు రకాల పాత్రలు పోషించిన బిఆర్ఎస్ కార్యకర్తలు నిజంగా ధన్యులు. ఉద్యమమంటే సామాన్యమైన ఉద్యమం కాదు. పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నారు. వారంలో నాలుగు రోజులు బైండోవర్ ఎదుర్కొన్నారు. ఉద్యమం సమయంలో అనేక సార్లు జైలుకెళ్లారు. పోలీసుల దెబ్బలు తిన్నారు. అణచివేతకు గురయ్యారు. పోలీసు చేతుల్లో చిత్రహింసలు అనుభవించిన వాళ్లున్నారు. జీవితంలో కోలుకోలేని పరిస్ధితులను కూడా అనుభవిస్తున్నారు. కాళ్లూ చేతులు విరగొట్టుకున్నవాళ్లున్నారు. రాళ్ల దెబ్బలు తిన్న వాళ్లున్నారు. ఇలా బిఆర్ఎస్ తొలి నాళ్ల నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న కార్యకర్తల్లో చాలా మంది ఆస్దులను పోగొట్టున్నారు. భూములు పోగొట్టుకున్నారు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడారు. నిత్యం దీక్షలు చేశారు. రాస్తారోకోలు చేశారు. ధర్నాలు చేశారు. వంటా వార్పులు చేశారు. సభలు, సమావేశాలకు హజరయ్యేవారు. ఇలా నిత్యం ఉద్యమం కోసం, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లున్నారు. వారిని ఆ సమయంలో తిన్నావా? అని అడిగిన వాళ్లు లేరు. అయినా ఏ ఒక్క నాడు మనసు నొచ్చుకున్న వాళ్లు కాదు. అదీ బిఆర్ఎస్కు చెందిన కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలు ఆ తరం నుంచి నవతరానికి వచ్చినా, వయసు పెరుగుతున్నా కార్యకర్తలుగానే వున్నారు. అలాంటి వారిని గుర్తించాల్సిన అవసరం వుంది. వారిని పార్టీ పరంగా ప్రోత్సహకాలు అందించాల్సి వుంది. పదవులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైన వుంది. 2014 నుంచి పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానించారు. తమకు పదవులు దక్కకపోయినా సహించారు. పార్టీ ఎవరికి పదవులు ఇచ్చినా ఓర్చుకున్నారు. ఎన్నికల సమయంలో టిక్కెట్లు ఎవరికిచ్చినా గెలిపించుకున్నారు. చిన్నా చితక పదువులు కూడా అనేకం త్యాగం చేశారు. కొత్త , పాత కలయికతో కలిసి సాగాలంటే ఒప్పుకున్నారు. కొత్తగా వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నా సహించారు. ఇలా ఎన్నో రకాల త్యాగాలు కార్యకర్తల సొంతం. చెరువు నిండితే కప్పలు చేరినట్లు పార్టీ బాగున్నప్పుడు చాల మంది వచ్చారు. పార్టీలో పదవులు పొందారు. పార్టీ ఓడిపోగానే మళ్లీ వారిదారి వారు చూసుకున్న వారు వున్నారు. ఇప్పటికైనా పార్టీ తేరుకోవాలి. నిజానిజాలు గ్రహించాలి. కొత్త నీరు అవసరమే..కాని మురికి నీరు వద్దన్న సంగతి తెలుసుకోవాలి. పార్టీ ఓడిపోగానే పది మంది ఎమ్మెల్యేలు ఎలా జారుకున్నారో చూశాం..వారికి ఎంత ప్రాధ్యాత కల్పించినా పార్టీని వదిలేశారు. కాని కార్యకర్తలు అలా కాదు. పార్టీ కోసమే పనిచేస్తారు. జీవితంలో అవకాశాలు రాకపోతాయా? అన్న ఆశతో రాజకీయలు చేస్తుంటారు. పార్టీని నమ్ముకొని వుంటారు. వారికి ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం వుంది. బిఆర్ఎస్ మీద ఇప్పటికే ఓ అపవాదుంది. పార్టీ నిర్మాణం ఆది నుంచి చేపట్టరు అనే వాదన వుంది. దాన్ని చెరిపేయాల్సిన అసవరం వుంది. పార్టీని కాపాకునేందుకు బలంగా పార్టీ నిర్మాణం జరగాలి. క్షేత్ర స్దాయి నుంచి పదవుల పంపకాలు జరగాలి. భవిష్యత్తులో పార్టీ అదికారంలోకి వచ్చినా పార్టీ యంత్రాంగమే పవర్ పుల్ అనే సంకేతాలిచ్చేలా కార్యకర్తలను గౌరవించాలి. ఇంత కాలం పార్టీకి సేవ చేస్తూ వస్తున్న వారిని వెంటనే గుర్తించాలి. వారి చేత పార్టీ నిర్మాణం జరగాలి. అన్ని స్ధాయిల్లోనూ పార్టీ పదవులు పంపకాలు చేపట్టాలి. పదేళ్లపాటు ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన వారికి పార్టీ సలహా మండలిలో స్ధానం కల్పించాలి. ఇప్పటి వరకు ఏ పదువులు అందని వారిని గుర్తించి పదవులు అందించాలి. అప్పుడు పార్టీకి వచ్చే ఊపు అంతా ఇంతా కాదు. పార్టీలో కనిపించే ఉత్సాహం అంచనా వేయడం కష్టం. అంతలా గులాబీ విరబూస్తుంది. కారు జోరునందుకుంటుంది. ప్రత్యర్ధులు మందు దుమ్మురేపుకుంటూ పరుగులు పెడుతుంది. మరో రెండు దశాబ్ధాల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అసవరం లేకుండా రాజకీయం ముందుకు సాగుతుంది. ఒక్కసారి ఆ దిశగా ఆలోచన చేసి చూడండి. పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టండి. ఇప్పటికైనా కార్యకర్తలు చూపే దారిలో పార్టీని నడపండి. పార్టీ ఓడిపోయి కష్టకాలంలో వున్నా కేసిఆర్‌కు నిజమైన నైతిక స్ధైర్యం అందిస్తున్న ఏకైక వర్గం క్యార్యకర్తలే…ఇది ఎప్పుడూ మర్చిపోవద్దు. కేటిఆర్, హరీష్‌రావులు జిల్లాలకు వెళ్తే ఎగేసుకుంటూ వచ్చి, జేజేలు పలుకుతున్నది కేవలం కార్యకర్తలే. తమ నాయకులు వస్తున్నారని ప్రజలను పోగు చేసి ఉత్సాహంగా తీసుకొచ్చి, సభలు విజయవంతం చేస్తున్నది కార్యకర్తలే. నాయకులకు పూలాభిషేకాలు, పాలాబిషేకాలు చేస్తూ జేజేలు పలికేది కార్యకర్తలే.