ఏఐసిసి,పీసీసీ పిలుపు మేరకు జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఏఐసిసి,పీసీసీ పిలుపు మేరకు జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీ జహీరాబాద్ పట్టణంలో బుధవారం రోజున నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,జై బాపు జై భీం జై సంవిధాన్ జహీరాబాద్ ఇంచార్జ్ ధనలక్ష్మి. ముఖ్యఅతిథిలుగా హాజరైయ్యారు.
ఈ సందర్భంగా సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా మరియు రాజ్యాంగాన్ని సంరక్షించుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ,మండలాల నాయకులు మరియు మాజీ యం.పి.పిలు,మహిళా కాంగ్రెస్ నాయకులు,మాజీ జెడ్పీటీసీ లు,మాజీ మున్సిపల్ చైర్మన్ లు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ సర్పంచ్ లు,మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.