
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.
కాప్రా నేటిధాత్రి 25:
మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ క్రైస్ట్ గోస్పల్ మినిస్ట్రీస్ చర్చ్ లో క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంతవరకు మన జీవితాల్లో వెలుగులు నింపి, నిత్యం మనల్ని ముందుకు నడుపుతూ కృప చూపిన నా యేసయ్య ఇక ముందు కూడా మనందరిని కరుణించి ఎలాంటి ఆపద రాకుండా, అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని కోరారు. పాస్టర్ బిషప్ దేవదానం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు గుమ్మడి జంపాల్ రెడ్డి, ఉల్లెం బాలరాజు, నవీన్ గౌడ్, నిసార్ అహ్మద్ గోరి, శివాజీ తదితరులు పాల్గొన్నారు.