
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ఫారెస్ట్ బీట్ అధికారుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజు ఫారెస్ట్ బీట్ అధికారుల కోసం హన్వాడ మండలం పిల్లిగుండు గ్రామంలో నిర్మించిన నివాస భవనాన్ని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించరు. ఈ కార్యక్రమం లో అయన మాట్లాడుతు. అడవుల సంరక్షణ కోసం ఫారెస్ట్ బీట్ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని. అడవులు సంరక్షణ కోసం అనుక్షణం ఎంతో కష్టపడుతున్నారని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని ఎదుర్కోని సమాజం బాగుండాలంటే అడవులు బాగుండాలనే ఆశయంతో బీట్ అధికారులు 24/7 పనిచేస్తున్నారని ఆయన వారిని అభినందించారు.
అనంతరం 75వ వన మహోత్సవం సందర్భంగా బీట్ ఆఫీసర్ నివాస భవనం లో మరియు చిన్న దర్పల్లి ఫారెస్ట్ లో అధికారులు, ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటి అడవులను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి స్వర్ణాసుధాకర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,డిఎఫ్ఓ సత్యనారాయణ, పిడి డిఆర్డిఎ నర్సింహులు,ఎంపిపి బాల్ రాజు, ఎంపిటిసి మునెమ్మ ,జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్, నాయకులు బి.సుధాకర్ రెడ్డి, లింగం నాయక్, శేఖర్ నాయక్, వెంకటాద్రి , వేముల కృష్ణయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.