Declare Parakala as Amaraveerula District
పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలి
లేదా పాత పద్దతిలో రెవన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి
బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి
పరాకాల,నేటిధాత్రి
పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని, లేకపోతే చిట్యాల,రేగొండ, మొగుళ్లపల్లి,శాయంపేట మండలాలతో కలిసి పరకాల రెవెన్యూ డివిజన్ గా రూపుదిద్దాలని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి డిమాండ్ చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు,వ్యాపారవేత్తలు,ప్రజా సంఘాలు సమస్యపై గళం విప్పుతున్నాయని పోరాట చరిత్ర కలిగిన అమరవీరుల త్యాగాలను గుర్తించి జిల్లాగా గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నారు.అమరవీరుల స్ఫూర్తికి న్యాయం చేయాలంటే ‘పరకాల అమరవీరుల జిల్లా’ ఏర్పాటే సరైన నివాళి అవుతుందని లేద జిల్లాగా ప్రకటించలేకపోతే చిట్యాల,రేగొండ, మొగుళ్లపల్లి,శాయంపేట మండలాలను కలుపుతూ ప్రత్యేక రెవెన్యూ డివిజన్ స్థాపించాలని డిమాండ్ చేశారు.
