
పరకాల నేటిధాత్రి
గురువారం రోజున పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరకాల సభ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి మరియు పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద నిర్వహించడం జరిగింది.ఈ అవగాహన కార్యక్రమంలో పరకాల ఏసిపి కిషోర్ కుమార్ మాట్లాడుతూ యువకులు,విద్యార్థులకు చెడు వ్యసనాలకు పాల్పడకుండా చదువుతూ ఏకాగ్రత పెంచి మంచి ప్రవర్తనతో జీవించి, తల్లిదండ్రుల అనుసరించిన మార్గంలో నడుచుకొని దేశ భవిష్యత్తు కోసం విద్యార్థి,యువత కీలకమని అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణలోని అన్ని ప్రాంతంలలో అభివృద్ధి కొరకు ముఖ్యంగా యువత మదకద్రావ్యాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా పోలీస్ శాఖ వారికి ఆదేశాలు జారీ చేసినారని,దానికి అనుగుణంగానే ఈరోజు నేడు మేం పాటుపడుతున్నామని, వారి కృషి ద్వారా మనమందరం కలిసి మంచి పని కోసం పాటుపడే రీతిలో నడుచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల నియోజవర్గ పరిధిలోని ఆత్మకూరు,దామెర పరకాల రూరల్,పట్టణం సిఐ రవిరాజు మరియు ఎస్ఐలు ఉమ్మడి పరకాల ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,పట్టణ కాంగ్రెస్ నాయకులు,విద్యావేత్తలు, ప్రముఖులు,యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.