పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం కప్ టోర్నమెంటు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ కు బయలుదేరుతున్న పరకాల ధ్యాన్ చందు హాకీ క్లబ్ కు చెందిన ఏడుగురు జాతీయ హాకీ క్రీడాకారులు జిల్లా అధ్యక్షులు హాకీ అసోసియేషన్ హనుమకొండ సోదా రామకృష్ణని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.వారిని అభినందిస్తూ ఎల్లవేళలా క్రీడాకారులకు అందుబాటులో ఉంటూ నా యొక్క సహాయ సహకారాలు అందిస్తానని క్రీడల్లో ప్రతిభ కనబరిచి హనుమకొండ జిల్లాకు సీఎం కప్పు తీసుకువచ్చి మంచి పేరును తీసుకురావాలని కోరి హాకీ టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ధ్యాన్ చందు హాకీక్లబ్ టీం బొజ్జం రాకేష్, నరేష్,నాగార్జున,రత్నాకర్, క్రాంతి,నరసింహ తదితరులు పాల్గొన్నారు.
హాకీ టీంకు శుభాకాంక్షలు తెలియజేసిన పరకాల మున్సిపల్ చైర్మన్
