పరకాల 2025 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
పరకాల నేటిధాత్రి
పట్టణంలో మంగళవారం రోజున ఎల్తూరి సంమృత వర్ధన్(చిన్ను)ఆధ్వర్యంలో చింతల్ గ్రౌండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 ని మాజీ శాసనసభ్యులు మోలుగూరి బిక్షపతి,క్రాంతి కుమార్,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొయ్యాడా శ్రీనివాస్ లు ప్రారంభించారు.అనంతరం క్రీడాకారుల పరిచయ కార్యక్రమం నిర్వహించి ఆటను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బిక్షపతి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి శారీరికంగా స్నేహభావంతో ఆడుకోవాలి గెలుపు ఓటుములు సహజంగా తీసుకోవాలి మంచిగా ఆట ఆడిన వారికి జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో సెలక్షన్లు అయినప్పుడు తప్పకుండా తగిన గుర్తింపు వస్తుందన్నారు.అందుకే ప్రతి క్రీడాకారుడు పట్టుదలతో ఆట ఆడి సాధించాలి అప్పుడే వారికి తగిన గుర్తింపు ఊరుకో జిల్లాకు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా ఆటలు ఆడాలని అన్నారు.ఈ కార్యక్రమం మాజీ కోఆప్షన్ సభ్యులు ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి,సమన్వయ కమిటీ నాయకులు దుబాసీ వెంకటస్వామి,కొలనుపాక సిద్దు,మంద టునీట్,జిల్లెల్ల వినయ్,వినాయక హాస్పిటల్ యజమాన్యం,దార సతీష్,ఏకు లడ్డు,మడికొండ లడ్డు,అఖిల్,ప్రణయ్,రమెష్ తదితరులు పాల్గొన్నారు.