నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ ఏసిపి నందిరాం నాయక్ ఆధ్వర్యంలో, సి.ఆర్.పి.ఎఫ్ పోలీసు బలగాల కవాతు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లో దైర్యం, స్థైర్యం, మేము ఉన్నాం అనే భరోసా ప్రజలకు కల్పించేందుకు మట్ట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెపిఎన్ రోడ్డు, ఎస్వియన్ రోడ్డు, పోచంమైదాన్ జంక్షన్, ఎంజీఎం సర్కిల్ మీదుగా మట్ట్వాడ పోలీస్ స్టేషన్ వరకు సిఆర్పీఎఫ్ పోలీసు బలగాలు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏసిపి నందిరాం నాయక్, మట్ట్వాడ సీఐ తుమ్మ గోపి, ఎస్ఐ లు, సిఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.