
Papanna Goud’s Name for Jangaon District Demand
జనగామ జిల్లా కు పాపన్న గౌడ్ పేరు నామకరణం చేయాలి
నర్సంపేట,నేటిధాత్రి:
భరతమాత ముద్దుబిడ్డ,తెలంగాణా తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును జనగామ జిల్లాకు నామకరణం చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు.వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హలులో శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375 వ జయంతి వేడుక సోమవారం జరిగింది. బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి పుష్పలత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ డా.సత్య శారద, జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పి సీఈఓ రాంరెడ్డి,కందాల శంకర్ గౌడ్ లు గౌడ సంఘాల అధ్యక్షులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రమేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రానికి చెందిన తొలి చక్రవర్తి జన్మస్థలమైన జనగామ జిల్లాకు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ప్రకటించిన విదంగా పాపన్న గౌడ్ పేరు నామకరణం చేయాలన్నారు.ఎలాంటి టెక్నాలజీ అవకాశాలు లేని 400 సంహాత్సరాల క్రితమే గోల్కొండ కోటకు రాజయి 7 నెలలు పరిపాలన చేశాడని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీకి సమకాళీకుడైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ను స్పోర్తిగా తీసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజనులు తమ సత్తా చటాలని రమేష్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో గౌడ సంఘాల నాయకులు గట్టు రమేష్ గౌడ్, డా. బైరి లక్ష్మి నారాయణ గౌడ్, తాళ్లపెళ్లి సురేష్ గౌడ్, రామగోనిసుధాకర్ గౌడ్,పోశాల పద్మ గౌడ్, మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్, వరంగల్, హన్మకొండ జిల్లాల అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, తోటకూరి రాందాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి బొమ్మగాని శ్యామ్ కుమార్ గౌడ్, కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, కొయ్యేడ ప్రవీణ్ గౌడ్, వేముల రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.