
Sardar Sarvai Papannagoud's
తొర్రూరులో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు
తొర్రూరుడివిజన్ నేటి ధాత్రి
తొర్రూరు పట్టణ కేంద్రంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలను గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బహుజన యుద్ధ వీరుడు, విప్లవకారుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మోకు దెబ్బ జిల్లా కార్యదర్శి మేరుగు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, “బహుజనులంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికార సాధన కోసం కలిసికట్టుగా కృషి చేయాలి. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకం కావాలి” అని పిలుపునిచ్చారు.

వేడుకల్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్ట కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు నిర్వహించిన భూమిపూజ సందర్భంగా వారి చిత్రపటాలకు గౌడ సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌడ సంఘాల నాయకులు మాట్లాడుతూ, “సర్దార్ పాపన్న విగ్రహ ప్రతిష్ట కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు” తెలిపారు.
కార్యక్రమంలో గోపా జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్, తొర్రూరు గోపా డివిజన్ అధ్యక్షుడు తాళ్లపల్లి రమేష్ గౌడ్ జీఎస్పీఎస్ అధ్యక్షులు దీకొండ శ్రీనివాస్ గౌడ్ కె ఎస్ పి ఎస్ గౌరవ అధ్యక్షులు చామకూరి ఐలయ్య గౌడ్ అధ్యక్షులు నాగపురి అశోక్ గౌడ్ ప్రధాన కార్యదర్శి కుంభం మహేష్ కుమార్ గౌడ్ ఎస్ఎస్పిజి అధ్యక్షులు చీకటి అశోక్ గౌడ్ కంట మహేశ్వర సంఘంలో గౌరవాధ్యక్షులు చీకటి రమేష్ గౌడ్ అధ్యక్షులు నిమ్మల శేఖర్ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గౌడ్ గౌడ యువజన సంఘం అధ్యక్షులు బొమ్మెర వినోద్ గౌడ్ కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, టౌన్ యువజన అధ్యక్షుడు బొమ్మ గాని మనోజ్ గౌడ్, చీకటి వీరన్న గౌడ్ తొర్రూరు పట్టణంలోని నాలుగు సంఘాల గౌరవ సభ్యులు ప్రజా
ప్రతినిధులు, స్థానిక నాయకులు, యువత, మహిళలు, మరియు పెద్ద సంఖ్యలో బహుజన ప్రజలు పాల్గొని జయంతి ఉత్సవాలను విజయవంతం చేశారు.