Shubman Gill Released from Team Due to Injury
కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న పంత్
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో అనూహ్యంగా మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా గిల్‌ను జట్టులోంచి రిలీజ్ చేశారు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలు పంత్ అందుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్ అయిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో మూడు బంతులే ఆడిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో గాయం తీవ్రతరం కావడంతో ఆ తర్వాత బ్యాటింగ్‌కే రాలేదు. కానీ చివరి ప్రయత్నంగా గిల్ శుక్రవారం ఫిట్నెస్ పరీక్షకు హాజరయ్యాడు. ఫలితం ఏంటంటే..
నవంబర్ 22(శనివారం) నుంచి టీమిండియా-సౌతాఫ్రికా మధ్య గువాహటి వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. జట్టుతో పాటు ఇప్పటికే గువాహటి చేరుకున్న గిల్ ప్రాక్టీస్‌లో మాత్రం పాల్గొనలేకపోయాడు. తాజాగా ఫిట్నెస్ పరీక్షలకు హాజరయ్యాడు. ఫలితం అనుకూలంగా రాకపోవడంతో జట్టు గిల్‌ను జట్టు నుంచి రిలీజ్ చేశారు. దీంతో అతడు ముంబైకి పయనమయ్యాడు. అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మరోసారి వైద్యులను సంప్రదించనున్నాడు. అయితే అతడిని సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు పంపే విషయమై ఇప్పటివరకు బీసీసీఐ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
