
"Pandit Deendayal Upadhyay Jayanti Celebrated in Mahadevpur"
మండలంలో ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
* నివాళులర్పించిన బిజెపి జిల్లా కౌన్సిల్ నెంబర్
మహాదేవపూర్ సెప్టెంబర్ 25 (నేటి ధాత్రి)
మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యర్యంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్ అధ్యక్షతన గురువారం రోజున శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా బస్ స్టాండ్ ఆవరణలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులూ అర్పించారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ అధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రo సిద్ధాంతకర్త అని, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25 న ఉత్తరప్రదేశ్ లోని మధుర దగ్గర ‘నగ్ల’ చంద్రబాన్ అనే గ్రామంలో జన్మించారని, మొదట కొద్దీ మంది స్వయం సేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశీక సహా ప్రచారక్ స్థాయికి ఏదిగారని, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్ధాంతానికి పునాదిగా చెప్పబడే ఏకత్మాత మానవతా వాదం, శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు రచించారాని, ఏకాత్మ మానవవాదం ప్రవచించి సమాజంలో అట్టడుగునా వున్నా వ్యక్తికి ప్రభుత్వ పథకాల్లో తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ విధానాన్ని రూపొందించిన శ్రీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులని వారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, మండల ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్ కుమార్, బీజేపీ నాయకులు దాడిగేలా వెంకటేష్, శంకర్, శ్రవణ్, మహేష్, రాకేష్, హరీష్, పాల్గొన్నారు,