జైపూర్ నేటి ధాత్రి:
గ్రామ పంచాయతీలలో తీవ్ర నిధుల కొరత ఉన్నందున గ్రామపంచాయతీ రోజువారి కార్య కలపాలకుగాను పంచాయతీ కార్యదర్శులకు వారి వేతనం డబ్బుల నుండి డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శులు తీవ్ర మానసిక మరియు ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. గ్రామాలలో రాబోయే రోజులలో బతుకమ్మ మరియు దసరా పండుగ ఏర్పాటు చేయవలసి ఉన్నందున కార్యదర్శులకు మోయలేని ఆర్థిక భారం పడనుంది. ఈ విషయం ప్రభుత్వానికి నివేదించి గ్రామపంచాయతీలకు తక్షణమే నిధులు విడుదల చేయుటకు చొరవ తీసుకోగలరు. ఇప్పటికే ఐ ఎఫ్ ఎం ఎస్ ద్వారా చేసిన చెక్కులు సుమారు 10 నెలలుగా క్లియర్ కాలేదు. దీని పర్యావసరంగా ఏ ఒక్క ఏజెన్సీ గాని ఫం మరియు ఇతర దుకాణ యజమానులు కూడా గ్రామపంచాయతీలకు సామాగ్రి ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కావున తక్షణమే గ్రామ పంచాయతీల యొక్క పెండింగ్ బిల్లులు విడుదల చేయుటకు చొరవ తీసుకోగలరు. గ్రామపంచాయతీ సిబ్బందికి కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించుటకు నిధులు లేనందున వారి కార్యక్రమాలు పారిశుద్ధ్య పనులు మరియు ట్రాక్టర్ డీజిల్ నిధులు లేనందున తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మన రాష్ట్రంలో ఏ ఉద్యోగి కూడా తన జీతం డబ్బులతో తన ఇంటికి తన కుటుంబానికి మాత్రమే ఖర్చు చేసుకుంటారు. కానీ గ్రామపంచాయతీ లో పనిచేయుచున్న పంచాయతీ కార్యదర్శులు మాత్రమే తమ జీతాలనుండి గ్రామపంచాయతీ అత్యవసర పనులకు ఖర్చు చేయవలసి వస్తుంది. గ్రామాలలో ప్రస్తుతం జరుగుతున్న స్వచ్ఛత హి సేవలు మరియు స్వచ్ఛతనం, పచ్చదనం లాంటి కార్యక్రమాలు ముఖ్యమైన పండగలు బతుకమ్మ దసరా దీపావళి ఉన్నందున వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించాలని కోరుతున్నాము. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.